Ashwin : సుదీర్ఘ ఫార్మాట్లో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) జోరు చూపిస్తున్నాడు. మొన్నటికి మొన్న బ్యాటింగ్‌లో రాణించి ఆరో సెంచరీతో భారత్‌ను గెలిపించిన అశ్విన్ ఇప్పుడు మరో ఘతన సాధించాడు. ఈ స్పిన్ మాంత్రికుడు ఆసియా ఖండంలోనే భారత్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.
కాన్పూర్ టెస్టులో తొలి రోజు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో వికెట్ తీసిన అశూ.. లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(Anil Kumble)ను దాటేశాడు. ఆసియా దేశాల్లో (భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్)లో ఎక్కువ వికెట్లు(420) పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. దాంతో, 419 వికెట్లు తీసిన కుంబ్లే రెండో స్థానానికి పడిపోయాడు. ఆసియా దేశాల్లో ‘మోస్ట్ వికెట్ టేకర్’గా లంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralidharan) అగ్రస్థానంలో ఉన్నాడు. తన అంతుచిక్కని స్పిన్‌తో మేటి బ్యాటర్లను సైతం క్రీజులో నిలువనీయని మురళీధరన్ ఆసియాలో 612 వికెట్లు తీశాడు.
చెపాక్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆరు (688)వికెట్లు తీసిన అశ్విన్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2024-25లో ఎవరికీ సాధ్యంకాని రికార్డు సృష్టించాడు. డబ్ల్యూటీసీ సైకిల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. తద్వారా తన పోటీదారుడు అయిన ఆస్ట్రేలియా లెజెండ్ నాథన్ లియాన్ (Nathan Lyon)ను అశ్విన్ దాటేశాడు. డబ్ల్యూటీసీ 2024-25 సైకిల్లో 11వసారి అతడు ఐదు వికెట్ల ప్రదర్శనర చేశాడు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ లియన్ 10 పర్యాయాలు ఈ ఘనత సాధించాడు.