Kamindu Mendis : శ్రీలంక యువకెరటం కమిందు మెండిస్ (Kamindu Mendis) రికార్డుల పర్వం కొనసాగిస్తున్నాడు. 147 ఏండ్లలో క్రికెట్ చరిత్రలో దిగ్గజాలకు సాధ్యంకాని రికార్డులను తన వశం చేసుకుంటున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చి రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్రపుటల్లోకెక్కిన కమిందు తాజాగా మరో ఫీట్ సాధించాడు. సొంతగడ్డపై గాలే స్టేడియంలో సెంచరీతో చెలరేగి 1,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
1949 తర్వాత తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సొంతం చేసుకున్న క్రికెటర్‌గా కమిందు చరిత్ర సృష్టించాడు. లంకకు టెస్టుల్లో ఆయువుపట్టుగా మారిన మెండిస్ 13 ఇన్నింగ్స్‌లోనే వెయ్యి క్లబ్లో చేరాడు. తద్వారా క్రికెట్ వెటరన్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును ఈ డాషింగ్ బ్యాటర్ సమం చేశాడు. అంతేకాదు అంతేకాదు ఈ ఏడాది ఐదో సెంచరీతో ఇంగ్లండ్ లెజెండ్ జో రూట్(Joe Root)ను వెనక్కి నెట్టేశాడు.
Kamindu 🤝 Bradman pic.twitter.com/pdyDIqdrk2
— ESPNcricinfo (@ESPNcricinfo) September 27, 2024
సుదీర్ఘ ఫార్మాట్లో శతకాల మోత మోగిస్తున్న కమిందు సొంతగడ్డపై రెండో సెంచరీతో మెరిశాడు. ఈ ఏడాది టెస్టుల్లో అతడికి ఇది ఐదో వంద. దాంతో, ఈ ఏడాది అత్యధిక సెంచరీల వీరుడిగా రికార్డు తన పేరిట రాసుకున్నాడు. గాలేలో జరుగుతన్న రెండు టెస్టులో న్యూజిలాండ్ బౌలర్లను ఉతికేస్తూ వంద కొట్టిన మెండిస్.. ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్(4 శతకాలు) రికార్డు బద్ధలు కొట్టాడు. మూడు సెంచరీలు బాదిన భారత ఆటగాడు శుభ్‌మన్ గిల్(10 ఇన్నింగ్స్‌లు), ఓలీ పోప్(20 ఇన్నింగ్స్‌లు), కేన్ విలియమ్సన్(13 ఇన్నింగ్స్‌లు)లు సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
Sri Lanka cashed in on a sloppy bowling and fielding performance by New Zealand, with three centurions in the first innings#SLvNZ https://t.co/mD2JJ1pyh5 pic.twitter.com/EFxtlvP5Ww
— ESPNcricinfo (@ESPNcricinfo) September 27, 2024
తొలి టెస్టులో న్యూజిలాండ్‌కు షాకిచ్చిన శ్రీలంక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ను 602-5 వద్ద డిక్లేర్ చేసింది. మొదట దినేశ్ చండిమల్(116) సెంచరీతో కదం తొక్కగా.. ఆ తర్వాత కమింద్ మెండిస్(182 నాటౌట్), కుశాల్ మెండిస్(106 నాటౌట్)లు శతకంతో చెలరేగారు. దాంతో లంక రెండో రోజే పట్టుబిగించింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 22 రన్స్ కొట్టింది. ఇంకా ఆ జట్టు 580 పరుగులు వెనకే ఉంది.