Viral video : ఆ బాలుడి వయసు 15 ఏళ్లు..! పేరు కార్తికేయ్..! పదో తరగతి చదువుతున్నాడు..! అతను ఉండేది ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో..! అదే రాష్ట్రంలోని కాన్పూర్‌లో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది..! భారత జట్టులో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు..! కోహ్లీ అంటే కార్తికేయ్కి కొండంత ప్రేమ..! ఎలాగైనా సరే ఉన్నావ్ నుంచి కాన్పూర్‌కు వెళ్లి తన అభిమాన క్రికెట్ర్ను చూడాలనుకున్నాడు..! అందుకోసం అతను చేసిన సాయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకూ కార్తికేయ్ ఏం చేశాడంటే..
ఉన్నావ్ నుంచి కాన్పూర్‌కు వెళ్లాలని నిశ్చయించుకున్న కార్తికేయ్ విషయాన్ని వాళ్ల తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో వాళ్లు తాము వెంటరాబోమని, సొంతంగా వెళ్తే వెళ్లవచ్చని అనుమతినిచ్చారు. దాంతో 58 కిలో మీటర్ల దూరం కార్తికేయ్ తను స్కూల్‌కు వెళ్లే సైకిల్‌పైనే వెళ్లాడు. తన అభిమాన క్రికెటర్‌ను కళ్లారా చూశాడు. కానీ రెండో టెస్ట్ తొలి రోజు భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆ బాలుడు కోహ్లీ బ్యాటింగ్ చూడలేకపోయాడు. ప్రస్తుతం ఆ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A 15-year-old kid rode 58 kilometers on his bicycle just to watch Virat Kohli bat pic.twitter.com/rigqQBoCHq
— A (@_shortarmjab_) September 27, 2024