JP Nadda : జమ్ముకశ్మీర్ (Jammu & Kashmir) కు రాష్ట్ర హోదా (State hood) కల్పించేది ఎన్డీఏ ప్రభుత్వమేనని (NDA Government) కేంద్ర మంత్రి (Union Minister), బీజేపీ చీఫ్ (BJP chief) జేపీ నడ్డా (JP Nadda) చెప్పారు. ఈ విషయాన్ని ఆర్టికల్ 370 (Article 370) ని రద్దు చేసినప్పుడే తాము స్పష్టం చేశామని తెలిపారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్ర హోదా ఇస్తామని తాము మాటిచ్చిన విషయాన్నే మేనిఫెస్టోలో చేర్చి కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర హోదా కల్పించే అధికారం ఉండదని గుర్తుచేశారు. రాష్ట్ర హోదా ఇచ్చే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుందన్నారు.