35 Chinna Katha Kaadu | ప్రియదర్శి (Priyadarshi), నివేదా థామస్ ( Nivetha Thomas), విశ్వదేవ్ ఆర్ (Viswadev R), ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). ఈ సినిమాకు నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించగా.. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలై నెల కూడా కాకుండానే ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను ప్రకటించింది.
ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ చిన్న కథ వెనుక పెద్ద పాఠం ఉంది! మన ఇంటి కథలా అనిపిస్తుంది… అని ఆహా పోస్టర్‌ను పంచుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తిరుపతిలో బస్ కండక్టర్‌గా పని చేస్తుంటాడు ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ). ఆయన భార్య సరస్వతి (నివేదా థామస్). వీరికి ఇద్దరు పిల్లలు అరుణ్, వరుణ్. అయితే తన భర్త పిల్లలే ప్రపంచంగా బతుకుతుంది సరస్వతి. చిన్నవాడు చదువులో పర్వలేదు కానీ పెద్దోడు అరుణ్‌కి మాత్రం లెక్కలు అంటే భయం. అవి అసలే అర్థం కావు. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందని లెక్కల మాస్టారు చాణక్య (ప్రియదర్శి)నే అడుగుతుంటాడు అరుణ్. ప్రాథమిక అంశాలనే ప్రశ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్‌కి జీరో అని పేరు పెట్టి చివరి బెంచీకి పంపిస్తాడు. వరుణ్‌కు లెక్కలు రాకపోవడం వలన అతడిని ఫెయిల్ చేస్తాడు చాణక్య. దీంతో తన తమ్ముడు వరుణ్ క్లాస్‌లోనే కుర్చుంటాడు అరుణ్. అరుణ్ పాస్ అయ్యి స్కూల్ కంటిన్యూ అవ్వాలంటే లెక్కల్లో 35 మార్కులు తెచ్చుకోవాలి. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లు అరుణ్‌ను మందలించగా.. ఇంటి నుంచి పారిపోతాడు. అయితే కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతే.. అతడి తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుంది. అరుణ్ లెక్కల పరీక్ష పాస్ అయ్యాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ చిన్న కథలో వెనుక పెద్ద పాఠం ఉంది!
మన ఇంటి కథలా అనిపిస్తుంది…😍Beautiful Blockbuster #35Movie Premieres 2nd October only on aha! @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @Nanduemani @RanaDaggubati @nikethbommi pic.twitter.com/r9qFyCpaJq
— ahavideoin (@ahavideoIN) September 27, 2024