డబ్లిన్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఐర్లాండ్ రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై 43 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. తద్వారా సఫారీ జట్టుపై తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. రెండో మ్యాచ్లో ఆండీ బాల్బిర్నీ (117 బంతుల్లో 102) శతకం సహా హెర్రీ టెక్టర్ (79) రాణించడంతో తొలుత ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 290 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 48.3 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌటైంది.