IND vs SL : తొలి వన్డేను టైగా ముగించిన శ్రీలంక (Srilanka) రెండో వన్డేలో పోరాడగలిగే స్కోర్ చేసింది. ఓ దశలో భారత బౌలర్ల ధాటికి రెండొందల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన లంక 240 రన్స్ కొట్టింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(40), కమిందు మెండిస్(40) రాణించగా.. గత మ్యాచ్ హీరో దునిత్ వెల్లలాగే(39) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, ఆతిథ్య జట్టు భారత్కు మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ తీసుకుంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతికే డేంజరస్ పథుమ్ నిశాంక()ను మమ్మద్ సిరాజ్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత అవిష్క ఫెర్నాండో(40), కుశాల్ మెండిస్(30)లు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. భారత బౌలర్లను విసిగిస్తూ రెండో వికెట్కు 72 పరుగులు జోడించారు. పటిష్ట స్థితిలో నిలిచిన లంకను వాషింగ్టన్ సుందర్(3/30) దెబ్బకొట్టాడు. అవిష్క, కుశాల్లను 5 పరుగుల వ్యవధిలో వెనక్కి పంపి లంకను ఒత్తిడిలో పడేశాడు. అనంతరం సధీర సమరవిక్రమ(14) అండగా కెప్టెన్ చరిత అసలంక(25) కాసేపు పోరాడాడు.
Sri Lanka recover superbly from 136-6 thanks to Dunith Wellalage and Kamindu Mendis 👊
Washington Sundar does well after an average outing in the first ODI
👉https://t.co/lUbBOz1iVA | #SLvIND pic.twitter.com/VnPoAoCWVH
— ESPNcricinfo (@ESPNcricinfo) August 4, 2024
కానీ, సుందర్, అక్షర్ పటేల్ వీళ్లను పెవిలియప్ పంపడంతో ఒకదశలో లంక 200లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. అయితే.. గత మ్యాచ్ హీరో దునిత్ వెల్లలాగే(39) ఆదుకున్నాడు. కమిందు మెండిస్(40)తో కలిసి ఏడో వికెట్కు 76 పరుగులు జోడించి జట్టు స్కోర్ దాటించాడు. ఆర్ధ శతకంపైగా భాగస్వామ్యం నిర్మించిన ఈ జోడీని కుల్దీప్ విడదీసి భారత్కు బ్రేకిచ్చాడు. అప్పటికి లంక స్కోర్.. 208/7. ఆఖర్లో అఖిల ధనంజయ(15)లు సమయోచితంగా ఆడడంతో లంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి రన్స్ కొట్టింది.