Wanindu Hasaranga : టీమిండియా చేతిలో సొంత గడ్డపై పొట్టి సిరీస్ కోల్పోయిన శ్రీలంక (Srilanka)కు భారీ షాక్. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) వన్డే సిరీస్ ఆఖరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తొడ కండరాల గాయం (Harmstring Injury)తో బాధ పడుతున్న హసరంగకు లంక విశ్రాంతినిచ్చింది.
తొలి వన్డేలో బౌలింగ్ చేస్తుండగా హసరంగ నొప్పితో బాధ పడ్డాడు. మ్యాచ్ అనంతరం అతడికి ఎంఆర్ఐ స్కాన్ తీయగా తీవ్ర గాయమైనట్టు తేలింది. దాంతో, చివరి రెండు వన్డేలకు హసరంగ స్థానంలో లెగ్ స్పిన్నర్
జెఫ్రే వండర్సే (Jeffrey Vandersey)ను సెలెక్టర్లు ఎంపిచ చేశారు.
🚨 Wanindu Hasaranga will miss the remainder of the ODI series, as the player has suffered an injury to his left hamstring. 🚨
He experienced pain in his left hamstring while delivering the last ball of his 10th over during the first ODI.
An MRI performed on the player,… pic.twitter.com/BWcv6l4k3a
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 3, 2024
తొలి వన్డేలో తన 10వ ఓవర్ వేస్తుండగా హసరంగ ఎడమ కాలి కండరాల నొప్పితో విలవిలలాడాడు. అనంతరం అతడికి మా వైద్య బృందం ఎంఆర్ఐ తీసింది. ఆ స్కానింగ్‌లో హసరంగకు గాయమైనట్టు వైద్యులు చెప్పారు. దాంతో, అతడికి విశ్రాంతినిచ్చాం అని లంక బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.
Match tied! 🏏
We fought hard and bowled out India for 230 runs, ending the match in a thrilling tie! 🇱🇰🇮🇳
A great effort from both sides.#SLvIND pic.twitter.com/gVWK1kJ3DX
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 2, 2024
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆగస్టు 2న జరిగిన తొలి వన్డేలో హసరంగ 24 పరుగులతో రాణించాడు. అనంతరం మూడు కీలక వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టాడు. 231 పరుగుల ఛేదనలో టీమిండియా 48వ ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ టైగా ముగిసిన విషయం తెలిసిందే.