Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థలు రూ.1,28,913.5 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. ఈక్విటీ మార్కెట్లలో బలహీన ధోరణుల నేపథ్యంలో ఐటీ మేజర్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయాయి. టీసీఎస్ రూ.37,971.83 కోట్లు నష్టపోయి రూ.15,49,626.88 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,811.88 కోట్ల పతనంతో రూ.7,56,250.47 కోట్లకు పరిమితమైంది.
ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,619.51 కోట్ల నష్టంతో రూ.6,11,423.11 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.13,431.54 కోట్లు కోల్పోయి రూ.7,56,717.85 కోట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.13,125.49 కోట్ల నష్టంతో రూ.20,28,695.57 కోట్ల వద్ద స్థిర పడింది.
భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.11.821.5 కోట్ల పతనంతో రూ.8,50,389.88 కోట్లతో సరిపెట్టుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.7,843.75 కోట్ల నష్టంతో రూ.8,42,176.78 కోట్లకు పడిపోయింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.4,288 కోట్లు కోల్పోయి రూ.6,32,862.41 కోట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.32,759.37 కోట్లు వృద్ధితో రూ.12,63,601.40 కోట్లకు దూసుకెళ్లింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ.1,075.25 కోట్లు పుంజుకుని రూ.7,47,677.98 కోట్ల వద్ద స్థిర పడింది. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 350.77 (0.43 శాతం) పతనమైంది. గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ నిలిచాయి.
Citroen Basalt | సిట్రోన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్.. !
Hyundai Venue | హ్యుండాయ్ వెన్యూ అప్ డేటెడ్ వర్షన్ వెన్యూ ఎస్ (ఓ)+.. ధరెంతంటే..?!
World Bank – India | ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు.. భారత్ ఆ స్థాయికి చేరుకోవాలంటే..!
Apple – Warren Buffett | ఆపిల్‌కు వారెన్ బఫెట్ షాక్.. సగం వాటా అమ్మేసిన బెర్క్ షైర్ హాత్ వే..!