Apple – Warren Buffett | అంతర్జాతీయంగా ఆర్థిక రంగంలో అనిశ్చితి నేపథ్యంలో గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్’కు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ గైడ్ వారెన్ బఫెట్ షాక్ ఇచ్చారు. ఆయన సారధ్యంలోని బెర్క్‌షైర్ హాత్వే కీలక నిర్ణయం తీసుకున్నది. 2024 ద్వితీయ త్రైమాసికంలో ఆపిల్‌లోని తన వాటాలో సుమారు సగం వాటాను బెర్క్‌షైర్ హాత్వే విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఒక శాతం వాటా విక్రయించిన బెర్క్‌షైర్ హాత్వే.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 13 శాతం వాటా తగ్గించుకున్నది. ప్రస్తుతం 789 మిలియన్ల నుంచి 400 మిలియన్ల షేర్లకు బెర్క్‌షైర్ హాత్వే వాటా తగ్గింది. దీంతో ఆపిల్ కంపెనీలో బెర్క్‌షైర్ హాత్వే వాటా సుమారు 2.6 శాతానికి తగ్గింది.
ఒకానొకప్పుడు ఆపిల్‌లో వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే వాటా దాదాపు సగం ఉండేది. గత త్రైమాసికంలో 135.4 బిలియన్ల డాలర్ల విలువ గల వాటాలు గల బెర్క్‌షైర్ హాత్వే వాటా ఇప్పుడు 84.2 శాతానికి తగ్గిపోయింది. గత త్రైమాసికంలో 88 బిలియన్ డాలర్ల నగదు నిల్వలు ఉన్న బెర్క్‌షైర్ హాత్వే.. భారీగా ఆపిల్ వాటాలు విక్రయించడంతో ఇప్పుడది 277 బిలియన్ డాలర్లకు పెరిగింది.
కొన్ని నాటకీయ పరిణామాలు జరగక పోతే తమ పెట్టుబడుల్లో అత్యధికం ఆపిల్’లోనే కొనసాగుతాయని గత మేలో వారెన్ బఫెట్ చెప్పారు. పన్ను సంబంధిత అంశాల కారణంగా మార్చి త్రైమాసికంలో 13 శాతం వాటాను విక్రయించింది. ఆర్థిక రంగంలో అనిశ్చితి నేపథ్యంలో వారెన్ బఫెట్ సారధ్యంలోని బెర్క్‌షైర్ హాత్వే.. శరవేగంగా నగదు నిల్వలు పెంచుకుంటున్నది. 2023 చివరికల్లా ఆపిల్ సంస్థలో బెర్క్‌షైర్ హాత్వే 905 మిలియన్ల షేర్లు ఉన్నాయి. ప్రస్తుత షేర్ విలువ ప్రకారం బెర్క్ షైర్ హాత్ వే వాటా విలువ 198.9 బిలియన్ డాలర్లు. గత మే నెలలో వారెన్ బఫెట్‌తో భేటీ తర్వాత ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ ‘మా సంస్థలో బెర్క్‌షైర్ హాత్వే వాటాదారుగా ఉండటం మాకు గర్వ కారణం’ అని వ్యాఖ్యానించారు.
Citroen Basalt | సిట్రోన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్.. !
Hyundai Venue | హ్యుండాయ్ వెన్యూ అప్ డేటెడ్ వర్షన్ వెన్యూ ఎస్ (ఓ)+.. ధరెంతంటే..?!
World Bank – India | ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు.. భారత్ ఆ స్థాయికి చేరుకోవాలంటే..!