బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 31, 2020 , 02:14:49

బీబీఎల్‌కు స్మిత్‌ దూరం

బీబీఎల్‌కు స్మిత్‌ దూరం

అబుదాబి: మరికొంత కాలం బయో బబుల్‌లో ఉండేందుకు ఇష్టపడని ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఈ ఏడాది బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) నుంచి తప్పుకున్నాడు. ఆగస్టు నుంచి బయో సెక్యూర్‌ వాతావరణంలో ఉంటున్న స్మిత్‌తో పాటు  వార్నర్‌, కమిన్స్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన స్మిత్‌ ‘నిజాయితీగా చెబుతున్నా.. చాన్సే లేదు’ అని అన్నాడు. ఈ ఏడాది చివర్లో టీమ్‌ఇండియా.. ఆసీస్‌లో పర్యటించనుండగా.. దాదాపు అదే సమయం (డిసెంబర్‌ 3 నుంచి 2021 ఫిబ్రవరి 6 వరకు)లో బీబీఎల్‌ పదో సీజన్‌ జరుగనుంది. దీంతో అంతర్జాతీయ స్టార్లు లీగ్‌కు దూరమయ్యే చాన్స్‌లు ఉన్నాయి.