ఒలింపిక్ అథ్లెట్లు, కోచ్‌లను టీకా ప్రాధాన్య జాబితాలో చేర్చండి..

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జపాన్‌లో జరిగే ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందిని సైతం కొవిడ్ వ్యాక్సిన్ ప్రాధాన్య జాబితాలో చేర్చాలని పార్లమెంటరీ ప్యానల్ గురువారం సిఫారు చేసింది. ఈ సందర్భంగా కోచ్ ఖాళీలపై ఆందోళన వ్యక్తం చేసిన కమిటీ.. సన్నాహాలు దెబ్బతినకుండా సమయానుసారంగా భర్తీ చేయాలని సూచించింది. జపాన్‌లో 2021, జూలైలో ఒలింపిక్స్ జరుగనున్నాయి. అర్హత కలిగిన అథ్లెట్లకు శిక్షణా సదుపాయాలు, క్రీడా కేంద్రాలను గుర్తించాలని ప్యానెల్ సిఫారు చేసింది. మూసివేసిన కేంద్రాలను ‘త్వరగా’ తిరిగి తెరవాలని, లేదంటే అథ్లెట్లను తెరిచిన ప్రత్నామ్నాయ కేంద్రాలకు మార్చాలని చెప్పింది. వినయ్ పీ సహస్రబుద్ధే నేతృత్వంలోని కీడ్రలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వర్చువల్ విధానంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి ‘ఒలింపిక్స్-2021’పై తన నివేదికను సమర్పించింది.
ఎంపిక చేసిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇతర శిక్షణా కేంద్రాల్లో వైద్య సిబ్బంది, ఎక్స్‌రే, ఎంఆర్ఐ పరికరాలను అందుబాటులో ఉంచాలని నివేదికలో కమిటీ సూచించింది. దీంతో ‘అథ్లెట్లు కోలుకునేందుకు సమయాన్ని కోల్పోకుండా ఉపయోగపడుతుందని, కొవిడ్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న హాస్పిటల్స్‌కు వెళ్లకుండా చూస్తుందని’ చెప్పింది. కరోనా ప్రేరేపిత లాక్డౌన్, ప్రయాణ పరిమితులు శిక్షణపై ప్రభావం చూపిందని ప్యానెల్ తెలిపింది. ఒలింపిక్స్ క్రీడలకు ముందు ఆటగాళ్లు గరిష్ఠ అంతర్జాతీయ టోర్నమెంట్లు ఆండే అవకాశం ఉండేలా చూడాలని, మెగా టోర్నీకి సిద్ధమయ్యేందుకు అంతర్జాతీయ పోటీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. దూర ప్రాంతాల్లో టోర్నమెంట్లకు అథ్లెట్లు వెళ్లడం పెద్ద సవాలేనని కమిటీ అభిప్రాయపడింది.
స్వదేశంలో టోర్నమెంట్లకు ఆథిత్యమిచ్చే ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు ఎక్కువ మంది చాంపియన్లను తయారు చేశాయని, భారత్ సైతం మరిన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇచ్చేలా చూడాలని, తద్వారా ఆటగాళ్లు ఎక్కువ పాయింట్లు సాధించి మెరుగైన ర్యాకింగ్స్ సాధిస్తారని పేర్కొంది. కొవిడ్ సంక్రమణ నేపథ్యంలో శిక్షణ సదుపాయాల్లో బయోబబుల్ ఏర్పాటు చేయాలని స్టాండింగ్ కమిటీ సిఫారు చేసింది. మహమ్మారి సమయంలో విదేశీ కోచ్‌లు రాజీనామాలు చేసి ఆయా దేశాలకు తిరిగి వెళ్లారని పేర్కొంది. చాలా క్రీడా విభాగాల్లో 65.. అంతకంటే ఎక్కువ వయసున్న విదేశీ నిపుణులు ఉన్నారు. వీరిని శిక్షణా కేంద్రాలకు రావొద్దని ఆయా కీడ్రా సంస్థలు కోరాయి. ప్రస్తుతం 561 కోచ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడింది. ఒలింపిక్స్ సన్నాహాలు దెబ్బతినకుండా కోచ్, సహాయ సిబ్బంది నిర్దిష్ట సమయంలో భర్తీ చేయాలని సూచించింది.
ఇవి కూడా చదవండి
త్వరపడండి.. కార్లపై భారీ డిస్కౌంట్లు
కరోనా వల్ల వాయిదా పడిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవి? నష్టం ఎంత?
‘కొవాగ్జిన్’తో ఏడాది వరకు యాంటీబాడీలు : భారత్ బయోటెక్
పారిస్ ఒప్పందం లక్ష్యాల దిశగా భారత్ : ప్రధాని మోదీ
తాజావార్తలు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ