Edgbaston Test : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సీజన్‌ను ఓటమితో ఆరభించిన భారత జట్టు (Team India) బోణీ కోసం కాచుకొని ఉంది. లీడ్స్‌లో చేతికందిన మ్యాచ్‌ను తన్నుకుపోయిన ఇంగండ్కు చెక్ పెట్టి సిరీస్‌లో నిలవాలని టీమిండియా భావిస్తోంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడడంపై సందేహాలు నెలకొన్న వేళ అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డస్చేట్ (Ryan ten Doeschate) తుదిజట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తమ ప్రణాళికల గురించి, జట్టు కూర్పు గురించి వెల్లడించాడు.
ఐదు టెస్టుల సిరీస్‌లో రెండోదైన ఎడ్జ్‌బాస్టన్ టెస్టు కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. దాంతో, భారత జట్టులో ఎవరెవరు ఉంటారు? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. బుమ్రాకు విశ్రాంతి నిస్తారా? కుల్దీప్ యాదవ్ ఎంట్రీ ఖాయమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న వేళ డస్చేట్ తుదిజట్టుపై స్పష్టతనిచ్చాడు. బుమ్రా అందుబాటులోనే ఉన్నాడు. ఐదింటిలో అతడు కనీసం మూడు మ్యాచ్‌లు ఆడుతాడని మాకు ముందుగానే తెలుసు. వర్క్‌లోడ్‌తో ఇబ్బంది పడిన బుమ్రా కోలుకునేందుకు ఎనిమిది రోజుల సమయం దొరికింది.
Bumrah watches on as Siraj, Prasidh and Akash steam in at the Edgbaston nets 💪 pic.twitter.com/6HT9zKvE5m
— ESPNcricinfo (@ESPNcricinfo) June 30, 2025
అయితే.. పరిస్థితులను బట్టి అతడి సేవల్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం. సో.. ఎడ్జ్‌బాస్టన్‌లో బుమ్రా ఆడడంపై 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటాం. ఇద్దరు స్పిన్నర్లు జట్టులో ఉంటారని కచ్చితంగా చెప్పగలను. జడేజా, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్.. వీరంతా బ్యాటింగ్ చేయగల సమర్ధులే. కానీ.. ఎడ్జ్‌బాస్టన్‌లో పిచ్‌ను బట్టి ఈ ముగ్గురిలో ఇద్దరిని తీసుకుంటాం అని డస్చేట్ వెల్లడించాడు.
వాషింగ్టన్ సుందర్, కుల్దీప్
జూన్ 2 బుధవారం ఆతిథ్య జట్టుతో టీమిండియా తలపడనుంది. సిరీస్‌లో మరింత వెనకబడకూడదంటే మ్యాచ్‌లో గెలిచితీరాల్సిందే. తొలి టెస్టులో ఐదు సెంచరీలు బాదినప్పటికీ.. బౌలింగ్ యూనిట్ వైఫల్యంతో ఓడిపోయింది భారత జట్టు. ఈసారి ఆ పొరపాట్లకు తావివ్వకుండా సిరీస్‌ను సమం చేయడమే లక్ష్యంగా ఆడనుంది గిల్ బృందం.