Wimbledon : అతడు ఒక కాలేజీ కుర్రాడు. టెన్నిస్ అంటే అతడికి మహా సరదా. ఆడుతున్నది తొలి గ్రాండ్‌స్లామ్ అయినా ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు. పచ్చికతో నిండిన కోర్టు మీద ప్రేక్షకులను అలరిస్తూ తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. అతడి పేరు ఒలివర్ టార్వెట్(Oliver Tarvet). 21 ఏళ్ల ఈ బ్రిటన్ సంచలనం సోమవారం జరిగిన ఫస్ట్ రౌండ్లో వింబుల్డన్ (Wimbledon) టోర్నీలో రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. 733 వ ర్యాంక్ ప్లేయర్. స్విట్జర్లాండ్‌కు చెందిన లియాండ్రో రీడీపై గెలుపొందాడు.
మూడు సెట్ల పోరులో ఆధిపత్యం చెలాయించిన ఒలివర్ 6-4, 6-4, 6-4తో ముందంజ వేశాడు. తదుపరి మ్యాచ్‌లో కార్లోస్ అల్కరాజ్ను ఎదుర్కోనే అవకాశముంది. కోర్టు నంబర్ 4లో లియాండ్రోను చిత్తు చేసిన ఈ యంగ్‌స్టర్ విక్టరీని కుటుంబం, స్నేహితులతో సెలబ్రేట్ చేసుకున్నాడు. ‘వింబుల్డన్‌లో ఆడాలనేది నా డ్రీమ్. రెండో రౌండ్‌కు వెళ్లడంతో పట్టలేనంత సంతోషంలో ఉన్నా. ఇది నా తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్. క్వాలిఫై అవ్వడమే కాకుండా తొలి విజయాన్ని నమోదు చేయడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది.
What a moment for Oliver Tarvet 🤩
The world No.719 takes down Leandro Riedi in straights sets to record his first-ever Grand Slam win after entering the main draw as a qualifier.#Wimbledon pic.twitter.com/k93Kg37huJ
— Wimbledon (@Wimbledon) June 30, 2025
రెండో రౌండ్లో కార్లోస్ అల్కరాజ్ను ఢీ కొడుతానేమో. ఆ విషయాన్ని ఊహించుకుంటేనే అద్భుతంగా అనిపిస్తోంది. వింబుల్డన్‌లో గెలుపొందాలనే నా కల సాకారమైంది’ అని మ్యాచ్ అనంతరం ఒలివర్ తెలిపాడు. లియాండ్రోపై విక్టరీ సాధించగానే ఈ బ్రిటన్ కుర్రాడు తన స్నేహితులను కౌగిలించుకున్నాడు. అంతేకాదు తాను చదువుతున్న సాన్ డీగో (San Diego) యూనివర్సిటీ క్యాప్ పెట్టుకొని మురిసిపోయాడు. టీషర్ట్ విప్పేసి.. తమ కాలేజీ జెర్సీ ధరించి సంబురాలు చేసుకున్నాడు. ఈమధ్యే అతడు వరుసగా రెండోసారి వెస్ట్ కోస్ట్ కాన్ఫరెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు.