శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Feb 12, 2021 , 01:43:24

డీఎస్పీగా హిమదాస్‌ నియమించిన అస్సాం ప్రభుత్వం

డీఎస్పీగా హిమదాస్‌ నియమించిన అస్సాం ప్రభుత్వం

న్యూఢిల్లీ: యువ స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌.. డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (డీఎస్పీ)గా నియమితురాలైంది. 21 ఏండ్ల హిమకు పోలీసు శాఖలో ఉద్యో గం ఇస్తూ ముఖ్యమంత్రి  సర్బానంద సొనోవాల్‌ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘నన్ను డీఎస్పీగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి సర్బానంద, మంత్రి హిమంత బిస్వాకు ధన్యవాదాలు. ఇది నాకు ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది’ అని హిమ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న హిమదాస్‌.. ఎన్‌ఐఎస్‌ - పాటియాలాలో శిక్షణ తీసుకుంటున్నది. 2018లో 400 మీటర్ల పరుగులో ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌గా అవతరించాక.. అదే ఏడాది ఆసియా గేమ్స్‌లో హిమ రజత పతకం సాధించింది. డీఎస్పీగా నియమితురాలైనా దేశం కోసం హిమ పరుగెడుతూనే ఉంటుందని కేంద్ర క్రీడా మంత్రి రిజిజు చెప్పారు. VIDEOS

logo