Kartik Kumar : నిరుడు ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన మారథాన్ రన్నర్ కార్తిక్ కుమార్(Kartik Kumar)కు బిగ్ షాక్. అమెరికాలో శిక్షణ తీసుకుంటున్న అతడు డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. పర్వత ప్రాంతంలోని కొలరాడోలో తన సహచరుడు గుల్వీర్ సింగ్(Gulveer Singh)తో కలిసి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు కుమార్.
అమెరికాకు చెందిన డోపింగ్ నిరోధక్ సంస్థ(USADA) ఈమధ్యే ఇద్దరి రక్త నమూనాలను తీసుకొని డోప్ టెస్టు నిర్వహించింది. అయితే.. గుల్వీర్ శాంపిల్స్ నెగెటివ్ రాగా.. కుమార్ శాంపిల్స్‌లో పాజిటివ్ వచ్చింది. కొన్ని రోజుల క్రితమే స్వదేశం నుంచి వచ్చిన కుమార్ సప్లిమెంట్లు కున్నాడని తెలిసింది. అందువల్లనే అతడి నమూనాల్లో టెస్టోస్టెరాన్.. దాని అనుబంధ పదార్థాలు బయటపడ్డాయని.. కాబట్టే డోప్ టెస్టులో పట్టుబడ్డాడని సమాచారం. అయితే.. కొన్ని రోజుల తర్వాత మళ్లీ కార్తిక్‌కు డోప్ పరీక్షలు జరిపే అవకాశముంది.
జావెలిన్ త్రోయర్ డీపీ. మను(DP Manu) సైతం డోప్ టెస్టులో దొరికిపోయాడు. 2023లో అతడి నుంచి సేకరించిన శాంపుల్స్‌లో నిషేధిత మిథైల్టెస్టోస్టెరాన్ (Mythyltestosteron) డ్రగ్ ఉన్నట్టు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) అధికారులు గుర్తించారు. దాంతో, సస్పెన్షన్ కారణంగా అతడు ప్యారిస్ ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. ఈమధ్యే నాడా మనుపై నాలుగేళ్ల నిషేధం విధించింది. 2024 జూన్ 24 నుంచి 2028 జూన్ 24 వరకు అతడిపైసస్పెన్షన్ కొనసాగనుంది.
🚨 Asian Championship Silver Medalist DP Manu has been handed a four-year ban by the NADA
DP Manu was found positive for prohibited substance methyltestosteron during meet in April 2023
He was earlier handed provisionally suspension & missed the Paris Olympics due to it!
[TOI] pic.twitter.com/UMzBluLnsg
— The Khel India (@TheKhelIndia) April 12, 2025