IND Vs BAN | ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ అనంతరం భారత జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటించనున్నది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. బీసీసీఐ మంగళవారం టీమిండియా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్టు 17న మొదలుకానున్నది. రెండవ వన్డే మ్యాచ్ ఆగస్టు 20న మీర్పూర్లో జరుగుతుంది. ఈ రెండు వన్డేలు మీర్పూర్లో జరుగుతాయి. మూడో మ్యాచ్ ఆగస్టు 23న చిట్టగాంగ్ వేదికగా నిర్వహించనున్నారు. ఆ తర్వాత టీ20 సిరీస్ మొదలు కానున్నది.
తొలి మ్యాచ్ ఆగస్టు 26న, రెండో మ్యాచ్ ఆగస్టు 29న, చివరి మ్యాచ్ అదే నెల 31న జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఆగస్టు 13న ఢాకా చేరుకోనుండగా.. పర్యటన ముగించుకొని సెప్టెంబర్ 1న తిరిగి స్వదేశానికి చేరుకుంటుంది. అంతకు ముందు టీమిండియా టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నది. ఈ పర్యటనలో బ్రిటీష్ జట్టుతో భారత్ ఐదు టెస్టులు ఆడనున్నది. ఈ సిరీస్ జూన్ 20న ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ లీడ్స్‌లో జరుగుతుంది. రెండో టెస్ట్ జూలై 2 నుంచి బర్మింగ్ హోమ్‌లో, మూడో మ్యాచ్ జులై 10 నుంచి లార్డ్స్‌లో, నాలుగో టెస్ట్ జులై 23 నుంచి మాంచెస్టర్‌లో, ఐదు టెస్ట్ 31 నుంచి ఓవల్ వేదికగా జరుగనున్నది.