Rekha Gupta | పాఠశాలల్లో ఏకపక్షంగా ఫీజుల పెంపుపై (School Fees Hike) ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. స్కూల్ ఫీజులు పెంపును ఏ మాత్రం సహించేది లేదని సీఎం (Delhi CM) రేఖా గుప్తా (Rekha Gupta) హెచ్చరించారు. పాఠశాలల్లో ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వారి ఆందోళన నేపథ్యంలో మోడల్ టౌన్ (Model Town)లోని క్వీన్ మేరీ స్కూల్ (Queen Mary School) యాజమాన్యం విద్యార్థులను వేధింపులకు గురి చేసింది.
అంతేకాదు పాఠశాల నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఎం రేఖా గుప్తా తీవ్రంగా స్పందించారు. పాఠశాలల్లో అడ్డగోలుగా ఫీజులు పెంచడం, విద్యార్థులు, తల్లిదండ్రులను వేధించడం వంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. అలా చేస్తే పాఠశాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
‘ఫీజుల పెంపు విషయంలో పాఠశాల యాజమాన్యాలు కొన్ని నియమ, నిబంధనలు పాటించాలి. అసాధారణంగా ఫీజులు పెంచరాదు. విద్యార్థులను వేధించకూడదు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవు. ఫిర్యాదులు అందిన పాఠశాలలకు నోటీసులు పంపుతాం. ఆయా పాఠశాలల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం’ అని సీఎం రేఖా గుప్తా తీవ్రంగా హెచ్చరించారు. పిల్లల హక్కులను కాపాడటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏ విధమైన దోపిడీ, అన్యాయాలు, అక్రమాలను జీరో టాలరెన్స్ విధానంతో పరిష్కరిస్తాం అని స్పష్టం చేశారు. ప్రతి బిడ్డకు న్యాయం, గౌరవం, న్యాయమైన విద్య లభించాలని అన్నారు. అంతేకాదు క్వీన్ మేరీ స్కూల్ ఘటనపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తక్షణమే దర్యాప్తు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
आज जनसंवाद कार्यक्रम के दौरान क्वीन मैरी स्कूल, मॉडल टाउन से संबंधित एक मामला सामने आया, जिसमें बच्चों के परिजनों ने गलत तरीके से फीस वसूली और बच्चों को स्कूल से निकाले जाने की शिकायत दर्ज की।
इस विषय पर तुरंत संज्ञान लेते हुए संबंधित अधिकारियों को तत्काल जांच कर कड़ी और आवश्यक… pic.twitter.com/gVThK6jFTn
— Rekha Gupta (@gupta_rekha) April 15, 2025
Also Read..
IIT Delhi | మైక్రాన్ టెక్నాలజీతో ఐఐటీ ఢిల్లీ భాగస్వామ్యం.. ఎందుకంటే..!
Supreme Court: అలహాబాద్ హైకోర్టు తీర్పులపై సుప్రీంకోర్టు అభ్యంతరం