Monsoon 2025 | రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన వాతావరణశాఖ.. ఈ సారి సాధారణం కంటే ఎక్కువగానే కురుస్తాయన్న ఐఎండీ..!
Monsoon 2025 | దేశ రైతులు, ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదవుతుందని మంగళవారం అంచనా వేసింది.
Monsoon 2025 | దేశ రైతులు, ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదవుతుందని మంగళవారం అంచనా వేసింది. మొత్తం సీజన్లో ఎల్ నినో పరిస్థితుల అవకాశాన్ని తోసి పుచ్చింది. నాలుగు నెలల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తం దీర్ఘకాల సగటు వర్షాపాతం 105శాతంగా ఉంటుందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర వెల్లడించారు.
న్యూఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. దేశంలో 1971-2020 మధ్యకాలంలో దీర్ఘకాల సగటు 87 సెంటీమీటర్లు మాత్రమే ఉండాదని పేర్కొన్నారు. భారత ఉపఖండంలో సాధారణం కంటే తక్కువ వర్షాపాతంతో సంబంధం ఉన్న ఎల్ నినో పరిస్థితులు ఈ సారి అభివృద్ధి చెందే అవకాశం లేదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్నాటకలోనూ సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని చెప్పింది. వాతావరణ శాఖ ఇచ్చిన అప్డేట్ దేశ రైతులకు ఎంతో ఉపశమనం కలిగించనున్నది.
నైరుతి రుతుపవనాలు భారత దేశ వ్యవసాయరంగానికి ఎంతో కీలకమైనవి. వ్యవసాయం దేశ జనాభాలో దాదాపు 42.3 శాతం మందికి జీవనోపాధి అందిస్తున్నది. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు 18.2శాతం దోహదపడుతున్నది. ఇటీవల కాలంలో వర్షం కురిసే రోజులు తగ్గుతుండగా.. స్వల్ప వ్యవధిలో భారీ వర్షాలు పెరుగుతోంది. దాంతో తరచూ కరువులు, వరదలు సంభవిస్తున్నాయని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే తీవ్రమైన వేడితో అల్లాడుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు గణనీయంగా ఎక్కువ సంఖ్యలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా వైవిధ్యం మరింత పెరిగిందని పేర్కొంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

