శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Jul 09, 2020 , 21:57:03

ఆసియాకప్‌ వచ్చే ఏడాదిలోనే..

ఆసియాకప్‌ వచ్చే ఏడాదిలోనే..

ముంబై: క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియాకప్‌ 2020 క్రికెట్‌ టోర్నీ వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో 2021లో నిర్వహించాలని ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) నిర్ణయించింది. ఈ మేరకు గురువారం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది శ్రీలంక ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపింది. 

కాగా, ఈ టోర్నీని వాయిదా వేసినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌గంగూలీ బుధవారం ఆజ్‌తక్‌ చానల్‌లో ఇన్‌స్టాగ్రాం ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది టోర్నీ ఆతిథ్య బాధ్యతలు పాకిస్తాన్‌కు ఉన్నాయి. అయితే, దాయాది దేశం వెళ్లేందుకు బీసీసీఐ నిరాకరించడంతో వేదికను యూఏఈకి మార్చారు. ఆ వెంటనే నిర్ణయం మార్చుకొని ఆతిథ్య హక్కుల్ని శ్రీలంకకు అప్పగించారు. ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్‌ సదుపాయాలు, క్రీడాకారులు, ఇతర సభ్యుల ఆరోగ్య ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని ఈ టోర్నీని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ఏసీసీ తెలిపింది. 2022లో ఆసియా కప్‌ టోర్నీకి పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇవ్వనుందని వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ టోర్నీని బీసీసీఐ నిర్వహించింది. దుబాయ్‌లో జరిగిన ఈ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo