Ashwin : ఒకప్పుడు మైదానంలో వికెట్ల వేటతో వార్తల్లో నిలిచిన భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) యూట్యూబ్ ఛానెల్‌తో వైరలవుతున్నాడు. తన క్రికెట్ జర్నీ గురించి, భారత జట్టు ప్రదర్శన గురించి మాట్లాడే అశ్విన్ తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఆటను విశ్లేషించాడు. లీడ్స్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో చెలరేగిన రిషభ్ పంత్ (Rishabh Pant)పై ప్రశంసలు కరిపించిన యశ్.. విమర్శలు ఎదుర్కొంటున్న యశస్వీ జైస్వాల్‌కు మద్దతుగా నిలిచాడు. అంతేకాదు శతక సంబురంలో పల్టీలు కొట్టిన పంత్‌ను మరోసారి అలా చేయకని వారించాడీ దిగ్గజ స్పిన్నర్.
‘లీడ్స్‌లో పంత్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడంకెల స్కోర్‌కు చేరుకోగానే హెల్మెట్ తీసి.. బ్యాట్‌ను పక్కనపడేసి ఫ్రంట్ ఫ్లిప్ చేశాడు. అతడలా పల్టీ కొట్టి సెలబ్రేట్ చేసుకోవడాన్ని అభిమానులు ఎంజాయ్ చేశారు. కానీ, నాకు అది రిస్క్ అనిపిస్తోంది. ఎందుకంటే.. టెస్టు క్రికెట్ వేరు ఐపీఎల్ వేరు. ఐపీఎల్లో 50 – 60 బంతులకు మించి ఎదుర్కోలేం.
టెస్టుల్లో మాత్రం గంటల తరబడి క్రీజులో ఉండాలి. శరీరం అలసిపోతుంది. ఆ సమయంలో సెంచరీ చాలా సంతోషాన్నిస్తుంది. కానీ, పల్టీ కొట్టే క్రమంలో చాలా జాగ్రత్త అవసరం. అందుకే.. పంత్‌ను మళ్లీ అలా చేయొద్దని కోరుతున్నా’ అని అశ్విన్ అన్నాడు.
Ravi Ashwin speaks on Rishabh Pant’s celebration.. pic.twitter.com/QW3dpb5dbT
— RVCJ Media (@RVCJ_FB) June 27, 2025
విదేశీ పర్యటన్లలో పంత్ బ్యాటింగ్‌లో, వికెట్ కీపింగ్‌లో రాణిస్తూ జట్టును ఆదుకుంటున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో ‘డబుల్ టన్’తో మెరిసిన పంత్‌ను మాజీ సారథి ఎంఎస్ ధోనీతో పోలుస్తున్నారు. అయితే.. మహీ, పంత్‌ల మధ్య పోలిక అర్ధ రహితం అంటున్నాడు అశ్విన్. ‘ధోనీ, పంత్‌లను పోల్చడం కరెక్ట్ కాదు. ఎందుకంటే.. ధోనీ ఐదో స్థానంలో ఎన్నడూ ఆడలేదు. అతడు వికెట్ కీపర్, బ్యాటర్. కానీ, పంత్ అలా కాదు. అతడు ఐదో స్థానంలో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడు బ్యాటర్, వికెట్ కీపర్. అందుకే.. పంత్‌ను దిగ్గజ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీతో పోల్చాలి.
Ravichandran Ashwin feels that comparing Rishabh Pant and MS Dhoni is unfair.#RavichandranAshwin #TestCricket #RishabhPant #MSDhoni #CricketTwitter pic.twitter.com/uisbUqBmfo
— InsideSport (@InsideSportIND) June 26, 2025
ప్రస్తుతం టీమిండియా ప్రధాన బ్యాటర్లలో పంత్ ఒకడు. అతడి టైమింగ్, బ్యాటింగ్, పేసర్లపై ఆధిపత్యం నిజంగా సూపర్’ అని వెల్లడించాడు అశ్విన్. ఈ క్రమంలోనే తొలి టెస్టులో నాలుగు క్యాచ్‌లు వదిలేసిన యశస్వీకి అశ్విన్ మద్దతిచ్చాడు. ‘స్లిప్‌లో యశస్వీ మెరుగైన ఫీల్డర్. అయితే.. డ్యూక్ బాల్ పరిమాణంలో పెద్దగా ఉంటుంది. ఆ బంతిని అందుకోవడం కొంచెం కష్టమే. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. ఇక ప్రేక్షలు అతడిని ఎంతగా స్లెడ్జ్ చేశారో మనం చూశాం’ అని అశ్విన్ వెల్లడించాడు.
Ravichandran Ashwin defends Yashasvi Jaiswal for his dropped catches in the 1st Test against England.#RavichandranAshwin #YashasviJaiswal #ENGvIND #CricketTwitter pic.twitter.com/VYpSKaz3Gj
— InsideSport (@InsideSportIND) June 27, 2025