Minority Gurukul School | కోరుట్ల, జూన్ 27: పట్టణ శివారులోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి సరఫరా చేస్తున్న నిత్యావసర వస్తువుల వివరాలు తెలుసుకున్నారు.
పాఠశాలలో సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఆమె వెంట ఆర్డీవో జీవాకర్రెడ్డి, తహశీల్దార్ కృష్ణ చైతన్య, కళాశాల ప్రిన్సిపల్ శంకర్, తదితరులున్నారు.