Jagityal | జగిత్యాల, జూన్ 27 : జిల్లా ట్రాన్స్కో ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన బి సుదర్శన్ ను శుక్రవారం జగిత్యాల జిల్లా ఐఎన్ టియూసి అధ్యకులు, విద్యుత్ శాఖ 327 యూనియన్ ప్రధాన కార్యదర్శి రాంజీ నాయిక్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు మర్యాద పూర్వకముగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అంతకు ముందు జగిత్యాలలో పని చేసిన సాలియా నాయక్ నిర్మల్ కు బదిలీ కాగా, ఆయనను ఉద్యోగులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జగిత్యాల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శంకర్, రాజమల్లు, బాలు వేణుగోపాల్ రెడ్డి, ప్రసాద్, ప్రకాశ్, ప్రమోద్ సుమన్ ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.