Paris Olympics 2024 | ఈక్వెస్ట్రియన్‌లో ఒలింపిక్స్ బెర్తు.. చిన్నప్పటి కల నిజమైందన్న అనుష్
Paris Olympics 2024 : నిరుడు ఆసియా క్రీడల్లో(Asian Games 2023) పతకంతో చరిత్ర సృష్టించిన భారత యువకెరటం అనుష్ అగర్వల్లా(Anush Agarwalla) ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ సాధించాడు. ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్(Dressage) విభాగంలో అతడు...
Paris Olympics 2024 : నిరుడు ఆసియా క్రీడల్లో(Asian Games 2023) పతకంతో చరిత్ర సృష్టించిన భారత యువకెరటం అనుష్ అగర్వల్లా(Anush Agarwalla) ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ సాధించాడు. ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్(Dressage) విభాగంలో అతడు విశ్వ క్రీడలకు క్వాలిఫై అయ్యాడు. ఈ విషయాన్ని మంగళవారం భారత ఈక్వెస్ట్రియన్ సమాఖ్య (EFI) వెల్లడించింది. పోలాండ్లోని వ్రొక్లా, నెదర్లాండ్స్‌లోని క్రొనెన్బర్గ్, జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, బెల్జియంలోని మిచెలిన్‌లో జరిగిన పోటీల్లో అనుష్ అదరగొట్టాడు.
దాంతో, ఈ ఏడాది జూన్‌లో జరిగే ప్యారిస్ ఒలింపిక్స్ పోటీల బెర్తు కొల్లగొట్టాడు. అయితే.. భారత ఈక్వెస్ట్రియన్ సమాఖ్య చివరి ట్రయల్ నిర్వహించాకే విశ్వ క్రీడల్లో పాల్గొనేవాళ్ల పేర్లను ప్రకటించనుంది.’దేశం తరఫున ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించినందుకు చాలా గర్వంగా, గొప్పగా అనిపిస్తోంది. ఒలింపిక్స్‌లో పోటీ పడాలనేది నా చిన్నప్పటి కల.
𝗢𝗹𝘆𝗺𝗽𝗶𝗰 𝗤𝘂𝗼𝘁𝗮! ✅
Anush Agarwalla earns a place for Team India in Equestrian (Individual Dressage) at #Paris2024 🏇
Congratulations!#RoadToParis2024 | #OlympicQualifiers | @WeAreTeamIndia
— Olympic Khel (@OlympicKhel) February 19, 2024
విశ్వక్రీడల్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడం మర్చిపోలేని ఫీలింగ్. ఎప్పటిలానే ఫోకస్‌గా ఉంటా. మరింత కష్టపడుతా. చిన్న చిన్న లక్ష్యాలను సాధిస్తూ ముందుకెళుతా’ అని 24 ఏండ్ల అనుష్ తెలిపాడు. నిరుడు చైనా వేదికగా జరిగిన 19వ ఆసియా క్రీడల్లో అనుష్ చరిత్ర సృష్టించాడు. ఈక్వెస్ట్రియన్ పోటీల్లో దేశానికి తొలి కాంస్య పతకం అందించాడు.
ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో అనుష్

డ్రెస్సేజ్ ఈవెంట్లో రౌతు, గుర్రం 20 మీటర్లు 60 మీటర్ల ప్రదేశంలో చిన్నగా రౌండ్లు కొట్టాల్సి ఉంటుంది. ఈ ప్రదేశంలో 12 అక్షరాల వరుస ఉంటుంది. ఈ పోటీలో ప్రిలిమినరీ, ఎలిమెంటరీ, మీడియం, అడ్వాన్స్డ్, అడ్వాన్స్డ్ మీడియం, అడ్వాన్స్డ్, ప్రిస్ట్ ఎస్టీ జార్డ్, ఇంటర్మీడియట్ -ఐ అని ఏడు దశలు ఉంటాయి. ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి ఒకటి నుంచి 10 పాయింట్లను కేటాయిస్తారు.
నలుగురు మాత్రమే..
ఇప్పటివరకూ భారత్ నుంచి నలుగురు మాత్రమే ఒలింపిక్స్‌లో ఈక్వెస్ట్రియన్ విభాగంలో పోటీ పడ్డారు. దర్యా సింగ్ 1980 మాస్కో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత ఇంద్రజిత్ లంబా (1996 అట్లాంటా), ఇంతియాజ్ అనీస్(2000 సిడ్నీ), ఫౌవాద్ మిర్జా(2022 టోక్యో)లు విశ్వ క్రీడల్లో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
- Smriti Irani: వయనాడ్ వదిలేయ్.. అమేథీలో పోటీ చేయ్.. రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
- Bull stops play | క్రికెట్ మ్యాచ్‌ను ఆపేసిన ఎద్దు.. తలోదిక్కు పరుగెత్తిన కుర్రాళ్లు.. వీడియో
- ORR | ఓఆర్ఆర్పై నుంచి కిందపడిన కారు.. ఇద్దరు యువకులు మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

