James Anderson : ప్రపంచంలోనే మేటి పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) అంతర్జాతీయ క్రికెట్కు ఘనంగా వీడ్కోలు పలికాడు. సొంతగడ్డపై లార్డ్స్ టెస్టు (Lords Test)లో ఆడిన జిమ్మీ విజయంతో కెరీర్ ముగించాడు. తన ఆఖరి టెస్టులో నాలుగు వికెట్లు తీసిన ఇంగ్లండ్ వెటరన్ సగర్వంగా ఆటకు గుడ్ బై చెప్పేశాడు. దాంతో, ప్రపంచ క్రికెట్లో ఓ మహాయోధుడి శకం ముగిసింది. 22 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఒకటా రెండా.. ఎన్నో మైలురాళ్లను అండర్సన్ అధిగమించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో 22 ఏండ్ల జర్నీ.. అంత ఈజీ కాదు. అలాంటిది ఓ పేసర్ గాయాలను తట్టుకొని, ఫిట్నెస్ కాపాడుకొని 188 401మ్యాచ్లు ఆడేశాడంటే అది నిజంగా అద్భుతమే. అందుకనే 41 ఏండ్ల వయసులోనూ అండర్సన్ బౌలింగ్ చేస్తుంటే.. ‘వయసు మర్చిపోయాడా ఏంటీ?’ అని అతడితో కెరీర్ మొదలెట్టిన వాళ్లు అసూయ పడేవారు.
Goodbye’s don’t come any harder ❤️ pic.twitter.com/UfbkFdyEe3
— England Cricket (@englandcricket) July 12, 2024
చెప్పాలంటే.. అండర్సన్ తన తరం, తర్వాతి తరంతో పాటు కలిసి ఆడాడు. సుదీర్ఘ కెరీర్లో మూడు ఫార్మాట్లలో 401 మ్యాచ్లు ఆడిన అండర్సన్ 991 వికెట్లు పడగొట్టాడు. అయితే వీటిలో అత్యధికం టెస్టుల్లో వచ్చినవే. రెడ్ బాల్ క్రికెట్లో 704, వన్డేల్లో 269, టీ20ల్లో 18 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా చరిత్ర సృష్టించాడు. దాంతో, ‘హ్యాపీ రిటైర్మెంట్’, ‘థ్యాంక్యూ అండర్సన్’ హ్యాష్ట్యాగ్లు వైరల్ అవుతున్నాయి.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ -5 బౌలర్ల జాబితాలో అండర్సన్ ఒకడు. 188 మ్యాచుల్లో 704 వికెట్లు పడగొట్టిన జిమ్మీ మూడో స్థానంలో నిలిచాడు. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో టాప్లో ఉండగా.. 708 వికెట్లు తీసిన దివంగత షేన్ వార్న్(ఆస్ట్రేలియా) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (619), ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్(604)లు వరుసగా నాలుగు, ఐదో ప్లేస్లో నిలిచారు.
One last time 🥲 pic.twitter.com/2G7svl9Q7K
— England Cricket (@englandcricket) July 12, 2024
అండర్సన్ వీడ్కోలు మ్యాచ్ అయిన లార్డ్స్ టెస్టులో బెన్ స్టోక్స్ సేన ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలుపొందింది. 250 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన విండీస్ 136 పరుగులకే కుప్పకూలింది. అండర్సన్ మూడు వికెట్లతో చెలరేగగా.. గట్ అట్కిన్సన్ 5 వికెట్లతో అదరగొట్టాడు. దాంతో, మూడో రోజే ఇంగ్లండ్ మ్యాచ్ను ముగించి సిరీస్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
End of an era.
Thank you, Jimmy Anderson 👏#WTC25 #ENGvWI pic.twitter.com/lJ3kFSHgUX
— ICC (@ICC) July 12, 2024