Anant Weds Radhika | అనంత్ అంబానీ వెడ్డింగ్‌కు సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. న్యూ లుక్ వైరల్
Anant Weds Radhika | అనంత్ అంబానీ (Anant Ambani) – రాధికా మర్చెంట్ (Radhika Merchant ) గ్రాండ్ వెడ్డింగ్‌కు సమయం ఆసన్నమైంది. గత ఏడు నెలలుగా సాగిన ఈ పెళ్లి తంతు చివరి అంకానికి చేరుకుంది. నేడు ముంబై బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ కాంప్లెక్స్ ఈ జంట అత్యంత ఘనంగా వివాహ బంధంతో ఒక్కటి కాబోతోంది.
Anant Weds Radhika | అనంత్ అంబానీ (Anant Ambani) – రాధికా మర్చెంట్ (Radhika Merchant ) గ్రాండ్ వెడ్డింగ్‌కు సమయం ఆసన్నమైంది. గత ఏడు నెలలుగా సాగిన ఈ పెళ్లి తంతు చివరి అంకానికి చేరుకుంది. నేడు ముంబై బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ కాంప్లెక్స్ ఈ జంట అత్యంత ఘనంగా వివాహ బంధంతో ఒక్కటి కాబోతోంది. ఇక ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలను ఆహ్వానించారు. దీంతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ కు సెలబ్రిటీలు క్యూ కట్టారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కాబోతున్న విషయం తెలిసిందే.
తాజాగా తెలుగు సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్ శుక్రవారం ముంబై చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి మహేశ్ ముంబై వెళుతుండగా ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటా పడ్డారు. ఈ వీడియోలో మహేశ్ న్యూస్టైల్లో అదరగోడుతున్నాడు. ఇక మహేశ్ న్యూస్టైల్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక మహేశ్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం దర్శక దిగ్గజం రాజమౌళితో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది.
ఇక అనంత్ అంబానీ – రాధికా మర్చెంట్ వివాహానికి ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ సెంటర్ వేదికైంది. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, క్రీడా ప్రముఖులు అతిథులుగా తరలివస్తున్నారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. ఇవాళ ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’తో మొదలయ్యే ఈ గ్రాండ్ వెడ్డింగ్.. 13న ‘శుభ్ ఆశీర్వాద్’, 14న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగియనున్నాయి.
Superstar #MaheshBabu departs mumbai for #anantambaniwedding @urstrulyMahesh pic.twitter.com/FTKC2RZLnN
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) July 12, 2024
Also Read..
Anant Weds Radhika | కళ్యాణ వేదికకు అనంత్ అంబానీ పయనం
Sara Ali Khan | అంబానీ ఇంట వివాహ వేడుకలో నటి సారా అలీఖాన్ సందడి.. Video
Anant Weds Radhika | అంబానీ ఇంట గ్రాండ్ వెడ్డింగ్.. భావోద్వేగ వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

