Sara Ali Khan : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి కొనసాగుతోంది. మరికాసేపట్లో ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ మెడలో తాళి కట్టనున్నాడు. ఈ వేడుక చూసేందుకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేస్తున్నారు. ప్రముఖుల రాకతో ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ (Jio World Convention Centre) కళకళలాడుతోంది.
కాసేపటి క్రితం బాలీవుడ్ నటి సారా అలీఖాన్ (Sara Ali Khan) తన సోదరుడు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) తో కలిసి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంది. ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన ఆమె ఫొటోలు తీసేందుకు ఫొటో జర్నలిస్టులు పోటీపడ్డారు. ఆమె వెళ్లిపోయే ప్రయత్నం చేసినా కొద్ది ప్లీజ్ మేడం.. వన్ మోర్ ఫొటో అంటూ రిక్వెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Mumbai | Actor Sara Ali Khan along with her brother Ibrahim Ali Khan arrive at Jio World Convention Centre in Mumbai for Anant Ambani-Radhika Merchant wedding pic.twitter.com/wDy7ZZhyRC
— ANI (@ANI) July 12, 2024