Anant Weds Radhika | అనంత్ అంబానీ (Anant Ambani) – రాధికా మర్చెంట్ (Radhika Merchant ) గ్రాండ్ వెడ్డింగ్‌కు సమయం ఆసన్నమైంది. గత ఏడు నెలలుగా సాగిన ఈ పెళ్లి తంతు చివరి అంకానికి చేరుకుంది. మరికాసేపట్లో ముంబై బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ కాంప్లెక్స్ ఈ జంట అత్యంత ఘనంగా వివాహ బంధంతో ఒక్కటి కాబోతోంది.
మరికొద్ది గంటల్లో ఈ మెగా వెడ్డింగ్ కన్నులపండువగా జరగనుండగా అంబానీ నివాసం అంటిలియా నుంచి కళ్యాణ వేదిక వద్దకు అనంత్ అంబానీ బయలుదేరారు. మరికొద్దిసేపటిలో ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చంట్ మెడలో తాళి కట్టనున్నారు. కాగా, అనంత్ అంబానీ – రాధికా మర్చెంట్ వివాహానికి ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ సెంటర్ వేదికైంది.
ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, క్రీడా ప్రముఖులు అతిథులుగా తరలివస్తున్నారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. ఇవాళ ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’తో మొదలయ్యే ఈ గ్రాండ్ వెడ్డింగ్.. 13న ‘శుభ్ ఆశీర్వాద్’, 14న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగియనున్నాయి.
Read More :
“Anant Weds Radhika | అంబానీ ఇంట గ్రాండ్ వెడ్డింగ్.. భావోద్వేగ వీడియో వైరల్”
“Nita Ambani | అంబానీ ఇంట దుర్గామాత పూజ.. ప్రత్యేక ఆకర్షణగా నీతా అంబానీ.. PHOTOS”