Nita Ambani | అంబానీ ఇంట దుర్గామాత పూజ.. ప్రత్యేక ఆకర్షణగా నీతా అంబానీ.. PHOTOS
Nita Ambani | అంబానీ ఫ్యామిలీ ‘మాతా కీ చౌకి (Mata Ki Chowki ) (దుర్గామాత పూజ)’ నిర్వహించింది. ఈ వేడుకల్లో అంతా సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ఇక ఈ వేడుకల్లో నీతా అంబానీ (Nita Ambani) హైలెట్‌గా నిలిచారు.
Nita Ambani | ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట పెళ్లి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), రాధికా మర్చెంట్ (Radhika Merchant) పెళ్లి ఈనెల 12వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మునిగి తేలుతోంది. ఈ నేపథ్యంలో వేడుకల్లో ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’కు ఒక్కరోజే ఉండటంతో అంబానీ ఫ్యామిలీ తాజాగా దుర్గామాత పూజ నిర్వహించింది.
అంతా మంచే జరగాలని ప్రతి ఒక్కరూ వివాహానికి ముందు ఇంట్లో పూజ నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా అంబానీ ఫ్యామిలీ కూడా ‘మాతా కీ చౌకి (Mata Ki Chowki ) (దుర్గామాత పూజ)’ నిర్వహించింది. ఈ వేడుకల్లో అంతా సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ఇక ఈ వేడుకల్లో నీతా అంబానీ (Nita Ambani) హైలెట్‌గా నిలిచారు. అనురాధ వకీల్ డిజైన్ చేసిన ఎరుపు రంగు గుజరాతీ ఘర్చోలా చీరలో మెరిసిపోయారు. చీర మొత్తం గోల్డ్ ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దారు. ఇక చీరకు తగ్గట్టే మ్యాచింగ్ నెక్సెట్, చెవిపోగులు, గాజులు ధరించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికతో అనంత్ వివాహం జులై 12న జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ పెళ్లి వేడుకలకు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. జులై 12న ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’తో మొదలయ్యే ఈ వేడుకలు.. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగుస్తాయి. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది.
Also Read..
Badrinath Highway | బద్రీనాథ్ హైవే క్లోజ్.. చిక్కుకుపోయిన 2 వేల మంది యాత్రికులు
Bharath Shetty | రాహుల్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. బీజేపీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

