Badrinath Highway | బద్రీనాథ్ హైవే క్లోజ్.. చిక్కుకుపోయిన 2 వేల మంది యాత్రికులు
Badrinath Highway | చమోలి జిల్లాలో బుధవారం బద్రీనాథ్ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారి (Badrinath Highway)పై భారీగా కొండ చరియలు విరిగిపడ్డారు. దీంతో ఆ రహదారిని కూడా అధికారులు మూసివేశారు.
Badrinath Highway | ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలకు ఎక్కడికక్కడ కొండచరియలు (Landslides) విరిగిపడుతుండటంతో కొండ రాష్ట్రాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి.
ఈ వర్షాలకు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 260కి పైగా రోడ్లు మూసివేశారు. చమోలి జిల్లాలో బుధవారం బద్రీనాథ్ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారి (Badrinath Highway)పై భారీగా కొండ చరియలు విరిగిపడ్డారు. దీంతో ఆ రహదారిని కూడా అధికారులు మూసివేశారు. సుమారు 48 గంటల పాటు ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
హైవే మూసివేతతో బద్రీనాథ్, జోషిమఠ్, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్లతో కనెక్టివిటీ తెగిపోయింది. సుమారు 2,000 మంది యాత్రికులు (Devotees Stranded) హైవేపై చిక్కుకుపోయారు. రహదారిని క్లియర్ చేసేందుకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు 241 ఎక్స్కవేటర్లను అక్కడ మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా ఛార్‌దామ్ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read..
Bharath Shetty | రాహుల్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. బీజేపీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు
Sougata Roy | జయంత్‌ను విడిపించకుంటే నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు : తృణమూల్ ఎంపీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

