Bharath Shetty | కాంగ్రెస్ అగ్రనేత, రాయ్‌బరేలి ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే (Karnataka BJP MLA)పై కేసు నమోదైంది. మంగళూరు సిటీ కార్పొరేషన్ సభ్యుడు అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.
ఇటీవలే 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో పార్లమెంట్లో శివుడి ఫొటోను రాహుల్ ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంగళూరు నార్త్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే వై. భరత్ శెట్టి (Bharath Shetty).. శివుడి ఫొటోను ప్రదర్శించిన రాహుల్ చెంప పగలగొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మంగళూరు డీసీపీ సిద్ధార్థ్ గోయల్ తెలిపారు.
Also Read..
Sougata Roy | జయంత్‌ను విడిపించకుంటే నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు : తృణమూల్ ఎంపీ
PM Modi | రెండు దేశాల పర్యటన ముగించుకొని భారత్ చేరుకున్న ప్రధాని మోదీ
lightning strikes | షాకింగ్.. నిన్న ఒక్కరోజే ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటుకు 37 మంది మృతి