lightning strikes | ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఈ క్రమంలో పిడుగులు పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలూ వెలుగు చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం బీహార్ రాష్ట్రంలో పిడుగుపాటుకు (lightning strikes) 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే పిడుగుపాటుకు ఏకంగా 30 మందికిపైగా మృత్యువాత పడ్డారు.
ఉత్తర ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం పిడుగుపాటుకు 37 మంది మరణించారు. అత్యధికంగా ప్రతాప్‌గఢ్ (Pratapgarh)లో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. సుల్తాన్‌పూర్‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌పురిలో ఐదుగురు, ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మరణించారు. అనేక మంది ప్రజలు పిడుగుపాటుకు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Droupadi Murmu | సైనాతో కలిసి సరదాగా బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ముర్ము.. VIDEO
బైక్ ప్రమాదంలో మిస్టర్ తెలంగాణ మహ్మద్ సోహైల్ మృతి
AP News | అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య.. డీకంపోజ్ స్థితిలో మృతదేహం