AP News | అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య.. డీకంపోజ్ స్థితిలో మృతదేహం
AP News | ఏపీలోని అనకాపల్లిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం గ్రామ శివారులోని గడ్డి తోటలో గ్రామస్తులకు ఓ మృతదేహం కనిపించింది. డీకంపోజింగ్ దశలో కనిపించిన ఆ మృతదేహంపై బ్లాక్ కలర్ టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ ఉన్నాయి.
AP News | ఏపీలోని అనకాపల్లిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం గ్రామ శివారులోని గడ్డి తోటలో గ్రామస్తులకు ఓ మృతదేహం కనిపించింది. డీకంపోజింగ్ దశలో కనిపించిన ఆ మృతదేహంపై బ్లాక్ కలర్ టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ ఉన్నాయి. నిందితుడు సురేశ్ పారిపోయినప్పుడు అదే డ్రెస్‌లో ఉండటంతో.. ఆ మృతదేహం అతనిదేనని అనుమానించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. విషం తాగి సురేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఘటనాస్థలిలో ఆధారాలు కనిపించాయి.
అనకాపల్లి జిల్లా కొప్పుగుండుపాలెంలో మైనర్ బాలిక హత్య ఇటీవల ఏపీలో సంచలనం సృష్టించింది. తనను జైలుకు పంపించారని పగ పెంచుకుని ఇంట్లోకి చొరబడి బాలిక గొంతు కోసిన ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బాలికను చంపి పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. 20కి పైగా బృందాలతో బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు మఫ్టీలో ఉండి మరీ నిందితుడి కోసం వెతికారు. ఈ క్రమంలోనే నిందితుడి ఆచూకీ చెబితే 50 వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. కాగా, మైనర్ బాలికను హత్య చేసిన అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మొదట్నుంచి పోలీసులు అనుమానించారు. హత్య జరిగిన స్థలంలో నిందితుడు రాసిన లేఖ ఆధారంగా పోలీసులు సందేహం వ్యక్తం చేశారు. చివరకు ఊహించినట్టుగానే నిందితుడు సురేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో నిందితుడు సురేశ్ తన అమ్మమ్మగారి ఊరైన కొప్పుగొండుపాలెంలోనే ఎక్కువగా పెరిగాడు. ఐటీఐ పూర్తి చేసి.. చాలా రోజులు ఖాళీగా ఉన్నాడు. ఆ సమయంలోనే చెడు అలవాట్లకు బానిసైనట్లు తెలుస్తోంది. కొంతకాలం డ్రైవర్‌గా పనిచేసి మానేశాడు. ఫార్మాసిటీలోని ఓ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా కూడా పనిచేశాడు. ఈ క్రమంలోనే కొప్పుగొండుపాలెం గ్రామానికి చెందిన బాలిక దర్శినిపై సురేశ్ కన్నేశాడు. ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు. పెళ్లి చేసుకుంటానని వెంటపడేవాడు. దీంతో బాలిక తన తల్లిదండ్రుల సాయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేశ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. రెండు నెలల క్రితం బెయిల్‌పై వచ్చిన సురేశ్.. బాలికను హత్య చేశాడు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- anakapalle
- AP News
- murder
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

