PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటన ముగిసింది. ఈ నెల 8, 9 తేదీల్లో రష్యాలో పర్యటించిన మోదీ.. తర్వాత ఆస్ట్రియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా రెండు దేశాల పర్యటనలు ముగించుకొని ప్రధాని భారత్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం (Palam airport)లో ల్యాండ్ అయ్యారు.
#WATCH | Prime Minister Narendra Modi arrives at Palam airport in Delhi after concluding his two-nation visit to Russia and Austria pic.twitter.com/DQgnniodrN
— ANI (@ANI) July 11, 2024
మోదీ రష్యా పర్యటన..
మోదీ సోమ, మంగళవారాల్లో రష్యా (Russia) లో పర్యటించిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మాస్కోలో మోదీ రెండు రోజులు పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా సోమవారం రాత్రి మోదీకి పుతిన్ తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. రెండో రోజు ఇద్దరు నేతలు విస్త్రృత చర్యలు జరిపారు. రష్యా అధ్యక్షుడి ముందు ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా తన సైన్యంలో నియమించుకొన్న భారతీయులను విముక్తి కల్పించేందుకు, వారిని వీలైనంత త్వరగా భారత్ పంపేందుకు మంగళవారం అంగీకారం తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన భేటీలో ఈ అంశాన్ని భారత ప్రధాని మోదీ లేవనెత్తిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకొన్నదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. రష్యా సైన్యంలో 35-50 మంధి భారతీయలు పనిచేస్తుండొచ్చని విదేశాంగ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే 10 మంది తిరిగి భారత్‌కు వచ్చేశారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ తెలిపారు. అదేవిధంగా అక్కడ 22వ భారత్ – రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత మాస్కోలోని ప్రవాస భారతీయులతో సంభాషించారు.
ఇది యుద్ధానికి సమయం కాదు.. ఆస్ట్రియా పర్యటనలో మోదీ
ఇక మాస్కో పర్యటన అనంతరం మోదీ మంగళవారం సాయంత్రం ఆస్ట్రియా (Austria) బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశ చాన్స్‌లర్ కర్ల్ నెహమ్మార్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పశ్చిమ ఆసియా, ఉక్రెయిన్ సంక్షోభాలు చర్చకు రాగా, ఇది యుద్ధానికి సమయం కాదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్, రష్యా శాంతి ప్రక్రియలో భారత్ ఎంతో ప్రధానమైనదని, అది శక్తివంతమైన ప్రభావవంతమైన పాత్రను పోషించగలదని ఆస్ట్రియన్ చాన్స్‌లర్ కర్ల్ నెహమ్మార్ అన్నారు. అదే సమయంలో తమ దేశం తటస్థ విధానాన్ని అవలంబిస్తుందని అన్నారు.
భారత ప్రధాని ఆస్ట్రియా పర్యటకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే తొలిసారి. 1983లో చివరిసారిగా ఇందిరా గాంధీ ఆ దేశాన్ని సందర్శించారు. ఇందిరా గాంధీ తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత ఆ దేశంలో పర్యటించిన రెండో ప్రధానిగా మోదీ నిలిచారు. మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం ప్రారంభమై 75 ఏండ్లు పూర్తయ్యాయని ఆస్ట్రియన్ చాన్స్‌లర్ కర్ల్ నెహమ్మార్ తెలిపారు.
Also Read..
lightning strikes | షాకింగ్.. నిన్న ఒక్కరోజే ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటుకు 37 మంది మృతి
Droupadi Murmu | సైనాతో కలిసి సరదాగా బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ముర్ము.. VIDEO
బైక్ ప్రమాదంలో మిస్టర్ తెలంగాణ మహ్మద్ సోహైల్ మృతి