Sougata Roy | పశ్చిమబెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభ ఎంపీ (Trinamool MP) సౌగతా రాయ్ (Sougata Roy)కి హత్య బెదిరింపులు (Death Threats) వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇటీవలే అరెస్ట్ అయిన సొంత పార్టీకి చెందిన జయంత్ సింగ్ (Jayant Singh)ను జైలు నుంచి త్వరగా విడుదల చేయకపోతే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. ఫోన్ కాల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
‘తెలియని నెంబర్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి జయంత్ సింగ్‌ను విడుదల చేయకపోతే నన్ను చంపేస్తానని బెదిరించాడు. అరియాదాహకు వెళ్ళినా కూడా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. కాలర్ నన్ను దూషించాడు. రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయంపై బరాక్‌పూర్ పోలీస్ కమిషనర్‌ను సంప్రదించా. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశా’ అని సౌగతా రాయ్ తెలిపారు.
కాగా, జూన్ 30న కళాశాల విద్యార్థి, అతని తల్లిపై కొంతమంది వ్యక్తులు దాడి చేయగా, దానికి సంబంధించిన వీడియో క్లిప్ వైరల్‌గా మారడంతో, ఈ దాడిలో జయంత్ సింగ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి జయంత్ సింగ్ సన్నిహితుడు మంగళవారం అర్ధరాత్రి పట్టుబడ్డాడు. అయితే అంతకుముందు 2023లో మరో కేసులో అరెస్టయి, ఇకపై ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా బాండ్‌తో బెయిల్‌పై జయంత్ బయటకు వచ్చారు. ఇప్పుడు తాజాగా మరో దాడి కేసులో ఇరుక్కున్నారు. ఇక బెయిల్ షరతులను ఉల్లంఘించినందుకు అదనపు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
Also Read..
Droupadi Murmu | సైనాతో కలిసి సరదాగా బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ముర్ము.. VIDEO
lightning strikes | షాకింగ్.. నిన్న ఒక్కరోజే ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటుకు 37 మంది మృతి