Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వ్ (India Forex Reserve) నిల్వలు ఆకాశాన్నంటే రీతిలో దూసుకుపోతున్నాయి. ఈ నెల ఐదో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు 5.16 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 657.16 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంతకు ముందు గత నెల 28తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 1.71 బిలియన్ డాలర్లు తగ్గి 652 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఆర్బీఐ వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంట్ గణాంకాల ప్రారం ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) 42.29 బిలియన్ డాలర్లు పెరిగి 577.11 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడింది. డాలర్ల విలువతో యూరో, పౌండ్, యెన్ వంటి నాన్ యూఎస్ డాలర్ కరెన్సీ విలువ వృద్ధి లేదా పతనం అయ్యే విలువలో ఎఫ్సీఏస్ కలిసి ఫారెక్స్ రిజర్వు నిధుల్లో ఇమిడి ఉంటాయి.
బంగారం రిజర్వు నిల్వలు 904 మిలియన్ డాలర్లు వృద్ధి చెంది 57.43 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎస్డీఆర్స్ 21 మిలియన్ డాలర్లు పెరిగి 18.04 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఐఎంఎఫ్ లో భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు 4 మిలియన్ డాలర్ల వృద్ధితో 4.58 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.
Honor 200 5G | 18న భారత్ మార్కెట్లోకి హానర్ 200 5జీ సిరీస్ ఫోన్లు.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
OnePlus 12R | కొత్త కలర్ ఆప్షన్‌తో త్వరలో భారత్ మార్కెట్లోకి వన్‌ప్లస్ 12 ఆర్