Rains | హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం.. ఉక్కపోతకు ఉపశమనం..
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. గత రెండు రోజుల నుంచి ఎండలు దంచికొడుతుండటంతో.. ఉక్కపోతతో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం చల్లని వాతావరణం ఏర్పడింది. ఇక వర్షం కురియడంతో నగర వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది.
Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. గత రెండు రోజుల నుంచి ఎండలు దంచికొడుతుండటంతో.. ఉక్కపోతతో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం చల్లని వాతావరణం ఏర్పడింది. ఇక వర్షం కురియడంతో నగర వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది.
గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి, పేట్‌బషీరాబాద్, సుచిత్ర, జీడిమెట్ల, కొంపల్లి, సూరారంతో పాటు సికింద్రాబాద్, బోయిన్పల్లి, బేగంపేట్, సనత్‌నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, బంజారాహిల్స్, ఉప్పల్, తార్నాక, హబ్సిగూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసింది.
రాబోయే రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు..!
రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మెరిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 12, 2024
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

