ముంబై: టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు వచ్చిన అమెరికా క్రికెటర్లు ఇక్కడి ఆహార పద్ధతులను ఆస్వాదిస్తున్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు మిగతా జట్ల కంటే ముందే భారత్‌లో అడుగుపెట్టిన అమెరికా ప్లేయర్లు ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. పేరుకు అమెరికా టీమ్ అయినా ఎక్కువ మంది భారత సంతతి క్రికెటర్లు కావడంతో ముంబై లోకల్ ఫుడ్‌పై మనసు పారేసుకున్నారు. ముఖ్యంగా పావ్‌బాజీ, పానీపూరి తింటూ మెగాటోర్నీ సందర్భంగా ఎంజాయ్ చేస్తున్నారు.
కెప్టెన్ మోనాంక్ పటేల్‌తో సహా సౌరభ్ నేత్రవాల్కర్, హర్మీత్‌సింగ్, మిలింద్‌కుమార్, శుభమ్ రంజనే, సంజయ్ కృష్ణమూర్తి, సాయితేజ, జస్దీప్సింగ్ లాంటి క్రికెటర్లు ఇక్కడి తిండిని ఇష్టంగా లాగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తమ తొలి మ్యాచ్‌లో ఈనెల 7న డిఫెండింగ్ చాంపియన్ భారత్‌తో అమెరికా..వాంఖడే స్టేడియంలో తలపడనుంది. సరిగ్గా రెండేండ్ల క్రితం వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమ్ఇండియా టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.