న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: సమయ పాలన పాటించడంలో మన రైల్వే శాఖ రోజురోజుకూ దిగజారుతుండటంపై పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో రైళ్ల సమయ పాలన 2021-22లో 90 శాతం ఉండగా, అది 2023-24 నాటికి 73.62 శాతానికి దిగజారినట్టు వెల్లడించింది. ‘భారతీయ రైల్వేలో సమయ పాలన, ప్రయాణ సమయం, ప్రయాణ రాకపోకలు’పై పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తన నివేదికను బుధవారం పార్లమెంట్‌కు సమర్పించింది.