Edgbaston Test : ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు బిగ్ షాక్. భారత పేసర్ ఆకాశ్ దీప్ (2-12) నిప్పులు చెరగడంతో ఆ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ ఒకే ఓవర్లో తొలుత బెన్ డకెట్(0)ను ఔట్ చేసి ఇండియాకు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత బంతికే తొలి టెస్టు సెంచరీ వీరుడు ఓలీ పోప్(0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. రాహుల్ క్యాచ్ అందుకోవడంతో.. 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఆతిథ్య జట్టు. ప్రస్తుతం జాక్ క్రాలీ(11), జో రూట్ క్రీజులో ఉన్నారు. ఇంకా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 574 పరుగులు వెనకబడి ఉంది.
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌కు షాకిస్తూ భారత జట్టు భారీ స్కోర్ చేసింది. లీడ్స్‌లో ఎదురైన ఓటమి నుంచి తేరుకొని.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(269) చరిత్రలో నిలిచేపోయే ఇనన్నింగ్స్ ఆడగా .. రవీంద్ర జడేజా(89), ఓపెనర్ యశస్వీ జైస్వాల్(87) కొండంత పరుగులో భాగమయ్యారు.
AKASH DEEP IS BREATHING FIRE 🔥
🔗 https://t.co/t4iTZ4cwcz pic.twitter.com/2fW9jhjrGb
— ESPNcricinfo (@ESPNcricinfo) July 3, 2025
రెండో రోజు తొలి సెషన్ నుంచి ఇంగ్లండ్ బౌలర్లకు కొరకుడుపడని కొయ్యలా మారిన గిల్ ద్విశతకంతో కదం తొక్కిన వేళ టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే.. ఆరొందలకు మరో 13 పరుగలు దూరంలోనే ఆగిపోయింది. లీడ్స్‌లో మాదిరిగానే బెన్ స్టోక్స్ సేన టెయిలెండర్లను చుట్టేసింది. గిల్ పెవిలియన్ చేరడమే ఆలస్యం ఆకాశ్ దీప్(6) పెద్ద షాట్‌కు యత్నించి బెన్ డకెట్‌కు సులువైన క్యాచ్ ఇచ్చాడు. బషీర్ బౌలింగ్‌లో సిరాజ్(8) పిచ్ వదిలి షాట్ ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. దాంతో, 587 వద్ద భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసింది.