Akash Deep : ఏ రంగంలోనైనా సరే అవకాశాలు అంత తేలికగా రావు. కొన్నిసార్లు నెలలకొద్దీ.. సంవత్సరాలకొద్దీ నిరీక్షించాల్సి ఉంటుంది. ఇక గట్టి పోటీ ఉండే భారత జట్టు(Team India)లో అయితే చాన్స్ రావడమే గగనం. అందుకని జట్టులోకి వచ్చినప్పుడే స్థానాన్ని పదిలం చేసుకోవాలి. ఈ విషయం బాగా తెలిసిన యువ పేసర్ ఆకాశ్ దీప్(Akash Deep) ఇప్పుడు అదే చేస్తున్నాడు. అంతర్జాతీయంగా మూడంటే మూడు టెస్టుల అనుభవంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నమ్మకాన్ని సంపాదించాడు ఆకాశ్.
కొత్త బంతితో నిప్పులు చెరుగుతూ నిఖార్సైన పేస్ బౌలర్ కొరతను తీరుస్తున్నాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా()పై ఒత్తిడి తగ్గిస్తూ జట్టులో పాతుకుపోతున్నాడు. నిలకడగా రాణిస్తున్న ఆకాశ్ నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికవ్వడం పక్కా అనిపిస్తోంది. అదే జరిగితే పేసర్లు మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్‌లకు తుది జట్టులో స్థానం కోసం అతడు గట్టి పోటీగా మారుతాడని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Had to move to Bengal (as ban on BCA)
At 23 was forced to take break for 3 years due to father suffered a paralytic attack
Lost his father & elder brother in 2 months time
Suffered a back injury that could have ended his career
Meet Akash Deep, Hero 👇🏽pic.twitter.com/PE5T2ikuaq
— Cricketopia (@CricketopiaCom) February 23, 2024
దేశవాళీలో అద్భుతమైన గణాంకాలో ఆకాశ్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రాంచీ టెస్టులో అరంగేట్రం చేసిన ఈ బెంగాల్ స్పీడ్‌స్టర్ పదకొండో బంతికే తొలి వికెట్ సాధించాడు. ఆ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన ఆకాశ్ ఇప్పుడు బంగ్లాదేశ్‌పై చెలరేగిపోతున్నాడు. చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో(2/19) అద్భుత ప్రదర్శనతో కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టిన ఆకాశ్.. కాన్పూర్ టెస్టులోనూ ఆదిలోనే రెండు వికెట్లతో శుభారంభమిచ్చాడు.
Want shami and akash deep spell in border gavaskar trophy 🏆 pic.twitter.com/XttdYrmjvp
— CrickTalk (@cricktalk12) September 27, 2024
మరోవైపు సిరాజ్ లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను కట్టడి చేస్తున్నా వికెట్ తీయలేకపోయాడు. ఆకాశ్ మాత్రం తెలివిగా బంగ్లా క్రికెటర్లను బోల్తా కొట్టించి జస్ప్రీత్ బుమ్రా తర్వాత వికెట్ టేకింగ్ పేసర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇంకేముంది.. స్వదేశంలో న్యూజిలాండ్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఆకాశ్ భారత జట్టుకు తరుపుముక్క అవుతాడని కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్‌లు భావిస్తున్నారు. ఆకాశ్ కంటే ముందు ముకేశ్ కుమార్(Mukesh Kumar), ప్రసిధ్ కృష్ణ(Prasidh Krishna)లకు సెలెక్టర్లు అవకాశమిచ్చారు. కానీ, వాళ్లు సద్వినియోగం చేసుకోలేదు. ప్రసిధ్ అయితే తరచూ గాయాలపాలవుతున్నాడు. ముకేశ్ కేవలం రంజీ , టీ20 స్పెషలిస్ట్‌గా రాణిస్తున్నాడంటే. ఆకాశ్ అలా కాదు. తన రంజీ అనుభవాన్ని ఉపయోగించి విజయవంతం అవుతున్నాడు. దాంతో
అదే జరిగితే.. మూడో పేసర్‌గా షమీ(అప్పటివరకూ ఫిట్నెస్ సాధిస్తే), సిరాజ్ మియాల మధ్య పోటీ నెలకొంటుంది. నవంబర్ 22న భారత్, ఆస్ట్రేలియాల మధ్య తొలి టెస్టు జరుగనుంది. 1992 తర్వాత తొలిసారి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌గా ట్రోఫీని నిర్వహించనున్నారు. వరుసగా రెండు పర్యాయాలు 2018, 2021లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందుకున్న భారత్ హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది.
భారత జట్టుకు ఆడాలనే కలల ప్రయాణంలో 27 ఏండ్ల ఆకాశ్ ఎన్నో కష్టాలు భరించాడు. అసలు అతడికి క్రికెట్ మీద ఇష్టం ఎలా పెరిగిందంటే?.. ఆకాశ్ దీప్ సొంతూరు బిహార్‌లోని ససారాం. అతడి తండ్రి రాంజీ సింగ్(Ramji Singh) ఓ స్కూల్ టీచర్. దాంతో, ఆయన కొడుకును చదువుపై దృష్టి పెట్టాలని పదే పదే చెప్పేవాడు. కానీ, అకాశ్కు క్రికెటర్ అవ్వాలనే కోరిక ఉండేది. 2007లో టీ20 వరల్డ్ కప్‌ను టీవీలో చూశాక ఆ కోరిక మరీ ఎక్కువైంది. ఆకాశ్ 2010లో దుర్గాపూర్‌లోని తమ అంకుల్ ఇంటికి వెళ్లాడు. అక్కడ క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకొని స్థానిక అకాడమీలో బ్యాటర్‌గా చేరాడు. అతడిని గమనించిన కోచ్‌లు బౌలర్‌గా రాణిస్తావని చెప్పారు. అలా.. బౌలింగ్ మీద ఫోకస్ పెట్టిన ఆకాశ్ జీవితం తండ్రి మరణంతో ఒక్కసారిగా తలకిందులైంది.
In a surprise move for #IPL2025, Akash Deep ✅ is India’s 3rd choice bowler, overtaking Mohammad Siraj ❌. The pace battle heats up as #AkashDeep shines, leaving #Siraj behind in the #IPLRetention race. 🏏🔥#INDvBAN #CricketRevolution #NewEra pic.twitter.com/1d2njRG1RG
— Ranu (@jyotsnam17) September 27, 2024
పక్షవాతంతో బాధపడుతూ తండ్రి మరణించిన కొన్ని రోజులకే ఆకాశ్ సోదరుడు కూడా చనిపోయాడు. ఈ రెండు విషాదాల కారణంగా ఆకాశ్ మళ్లీ సొంతూరుకు వెళ్లిపోయాడు. అక్కడితో క్రికెటర్ అవ్వాలనే తన కల కలగానే మిగిలిపోతుందనే బాధ అతడిని వెంటాడింది. అయితే.. మూడేండ్ల తర్వాత అంకుల్ చొరవతో ఆకాశ్ బెంగాల్‌లోని యునైటెడ్ క్లబ్లో చేరాడు.
అక్కడ బెంగాల్ పేర్ రనదేవ్ బోస్(Randev Bose) కంట్లో పడ్డాడు. రనదేవ్ శిక్షణలో రాటుదేలిన ఆకాశ్ బెంగాల్ అండర్-23 జట్టుకు ఎంపికయ్యాడు. అంతలోనే వెన్నెముక గాయం కావడంతో అతడి సంతోషంలో ఆవిరైంది. ఆ కష్ట సమయంలో బెంగాల్ కోచ్ సౌరాశిష్ లహిరి అండగా నిలవడంతో ఆకాశ్ తొందరగా కోలుకుని మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు.
రాణించిన ఆకాశ్ 2019లో బెంగాల్ రంజీ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. రంజీల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆకాశ్ దీప్‌ను 2021 ఐపీఎల్ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) కొన్నది. అక్కడితో ఆకాశ్ జీవితం మారిపోయింది. ఆ వెంటనే అతడు 2022లో ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక య్యాడు.
తల్లితో సంతోషం పంచుకుంటూ..
అనంతరం రంజీల్లో నిలకడైన ప్రదర్శనతో ఆకాశ్ జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. రాంచీ టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చి.. తన టెస్టు కలను నిజం చేసుకున్నాడు. రాంచీ మైదానంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకున్న ఆకాశ్ అనంతరం తల్లి లద్దుమా దేవీ పాదాలకు నమస్కరించాడు.