Jr Ntr – Devara | జపాన్‌కు వస్తానని మహిళ అభిమానికి మాటిచ్చిన ఎన్టీఆర్.. వీడియో
Jr Ntr - Devara | టాలీవుడ్‌తో పాటు ప్రపంచమంతటా ప్రస్తుతం దేవర సందడి నెలకొన్న విషయం తెలిసిందే. ఆరేండ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా రావడంతో అటు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ దేవర సినిమా చూసి సంబరాలు చేసుకుంటున్నారు.
Jr Ntr – Devara | టాలీవుడ్‌తో పాటు ప్రపంచమంతటా ప్రస్తుతం దేవర సందడి నెలకొన్న విషయం తెలిసిందే. ఆరేండ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా రావడంతో అటు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ దేవర సినిమా చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రాగా.. జాన్వీకపూర్ కథానాయికగా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పించగా.. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సక్సెస్‌పుల్‌గా రన్ అవుతుండగా.. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక బియాండ్ ఫెస్ట్వల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈనేపథ్యంలోనే బియాండ్ ఫెస్ట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్ (NTR).. అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. అనంతరం తనని కలిసేందుకు వచ్చిన పలువురు అభిమానులతో ముచ్చటించారు.
అయితే ఈ ఫెస్ట్‌లో ఎన్టీఆర్‌ను కలిసేందుకు ఒక మహిళ అభిమాని జపాన్‌లోని టోక్యో నుంచి జర్నీ చేసి లాస్ ఏంజెలిస్‌కు చేరుకుంది. బియాండ్ ఫెస్ట్వల్లో ఎన్టీఆర్‌ను కలుసుకుని మాట్లాడింది. అయితే తారక్‌ను చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది ఆ అభిమాని. తారక్‌తో మాట్లాడుతూ.. మిమల్ని చూసేందుకు ఎంతోమంది అభిమానులు జపాన్‌లో ఎదురుచూస్తున్నారని.. తమ దేశానికి రమ్మని ఆహ్వానించింది. ఆమె మాటలకు ఎన్టీఆర్ ఆనందం వ్యక్తంచేశారు. తప్పకుండా వస్తానని మాటిచ్చారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
How far would you go for your favourite…? @KO19830520 traveled all the way from Tokyo to Los Angeles just to watch #Devara with @tarak9999 at the @BeyondFest.
And when he met, her reaction was priceless! What a moment to witness! pic.twitter.com/l279HKo0gy
— Devara (@DevaraMovie) September 27, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొంటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

