YS Jagan | నా మతం మానవత్వం.. డిక్లరేషన్లో రాసుకోండి : వైఎస్ జగన్
YS Jagan | తిరుమల పర్యటనను మతం పేరుతో అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు.
అమరావతి : తిరుమల (Tirumala) పర్యటనను మతం పేరుతో అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan ) తీవ్రంగా స్పందించారు. తన తండ్రి వైఎస్సార్ అనేక సార్లు తిరుమలను దర్శించుకున్నారు. నేను సీఎంగా 5సార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించా. నా మతమేందో ప్రజలందరికీ తెలుసని అన్నారు. తిరుమల పర్యటన సందర్భంగా నెలకొన్న పరిస్థితులపై తాడేపల్లి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా తప్పేముంది. బయటకు పోతే హిందూత్వాన్ని, ముస్లిం, సిక్కు మతాలను గౌరవిస్తా.. అనుసరిస్తానని వెల్లడించారు. తిరుమలకు వస్తానంటే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం శోచనీయమని ఆరోపించారు. ‘ నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటే రాసుకోండని’ వెల్లడించారు. . దేవుడిని దర్శించుకోవడానికి ఐదేళ్లపాటు సీఎంగా పనిచేసినా వ్యక్తి పరిస్థితి ఇలా ఉంటే దళితుల పరిస్థితి ఏమిటని, వారిని రాబోయే రోజుల్లో గుడిలోకి రానిస్తారా. అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
తాను అధికారంలోకి రాకముందు చంద్రబాబు హయాంలోనే చేపట్టిన పాదయాత్ర తిరుమల నుంచే మొదలు పెట్టి, తిరుమలలోనే కాలినడకన స్వామివారిని దర్శించుకున్నానని వెల్లడించారు. అప్పుడు లేని మతం డిక్లరేషన్ ఇప్పుడే ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసం హిందూ ధర్మాన్ని వాడుకోవడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబుకు సబబేనా అంటూ నిలదీశారు.
మతాలను రాజకీయం కోసం వాడుకోవడం దౌర్భాగ్యమని అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబును ఎందుకు మందలించడం లేదని బీజేపీ అగ్రనాయకత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండేందుకు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో గుడిల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD | సెక్యూరిటీ ,విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
Health tips | మీ రోజువారీ డైట్లో వెల్లిపాయలుంటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
Diabetes | వయసుతోపాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వస్తాయా? పోషకాహార నిపుణుల కీలక హెచ్చరిక..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

