Team India : లార్డ్స్ టెస్టులో అనూహ్యంగా ఓటమిపాలైన భారత జట్టుకు మరో షాకింగ్ న్యూస్. మాంచెస్టర్‌లో విజయంతో సిరీస్ సమం చేయాలనుకుంటున్న టీమిండియా మ్యాచ్ విన్నర్ ఆకాశ్ దీప్ (Akash Deep) సేవల్ని కోల్పోనుంది. బర్మింగ్‌హోమ్‌లో 9 వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీసిన ఆకాశ్ గాయపడ్డాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) సైతం గాయంతో బాధ పడుతున్నాడు. సో.. ఈ ఇద్దరిలో ఒక్కరు కూడా మాంచెస్టర్ టెస్టులో ఆడడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ లయన్స్ (England Lions)పై వికెట్ల వేట కొనసాగించిన యువ పేసర్ అన్షుల్ కంభోజ్ (Anshul Kamboj)ను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు సెలెక్టర్లు.
బర్మింగ్హమ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ వికెట్ తీసిన తర్వాత ఆకాశ్ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. నొప్పి తగ్గకపోవడంతో మైదానం వీడిన అతడు కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నాడు. కాసేపయ్యాక మైదానంలోకి వచ్చినప్పటికీ ఆకాశ్ బౌలింగ్ చేయలేదు. దాంతో.. సిరాజ్, బుమ్రాలతో బౌలింగ్ చేయించాడు కెప్టెన్ గిల్. అర్ష్‌దీప్ విషయానికొస్తే.. ప్రాక్టీస్ సెషన్లో అతడి చేతివేలికి గాయమైంది. మాంచెస్టర్ టెస్టుకు ఇంకా మూడు రోజులే ఉంది.
NEWS: Anshul Kamboj gets a Test call-up before the 4th Test in Manchester #ENGvIND pic.twitter.com/skEPaYPxkg
— ESPNcricinfo (@ESPNcricinfo) July 20, 2025
ఈ నేపథ్యంలో మూడో పేసర్‌గా అన్షుల్‌ను తీసుకోవాలని కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ గిల్ నిర్ణయించినట్టు సమాచారం. భారత ఏ జట్టుతో ఇంగ్లండ్‌కు వెళ్లిన ఈ పేసర్ లయన్స్ టీమ్‌పై నిప్పులు చెరిగాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లతో చెలరేగాడు. అంతేకాదు బ్యాటుతోనూ రాణించి అజేయ అర్ధ శతకం సాధించాడీ కుర్రాడు. కాబట్టి.. లోయర్ ఆర్డర్లో కొన్ని పరుగులు చేయగల అన్షుల్ నాలుగో టెస్టులో ఆడినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.