లాస్ ఏంజెల్స్: బోయింగ్ (Boeing) విమానాలు ప్రయాణికుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. తాజాగా అమెరికాలో మరో బోయింగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్సుకు (Delta Airlines) చెందిన బోయింగ్ 767-400 (Boeing 767) విమానంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అయితే మంటలను గుర్తించిన పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన DL446 బోయింగ్ 767 విమానం లాస్ ఏంజిల్స్ నుంచి అట్లాంటాకు వెళ్తున్నది. ఈ క్రమంలో లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX) నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఎడమవైపు ఉన్న ఓ ఇంజిన్‌లో మంటలు అంటుకున్నాయి. గుర్తించిన పైలట్ ఏటీసీకి సమాచారం అందించారు. వారు అనుమతించడంతో లాస్ ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సహాయకులు, ఇద్దరు పైలట్లు కలిపి మొత్తం 294 మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ విమానం క్షేమంగా ల్యాండ్ అవడం, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
❗️Boeing 787 Makes Emergency Landing in LA 🇺🇸 – Engine ON FIRE 🔥
Video claims to show a Delta Airlines flight bound for Atlanta on Friday making an emergency landing at LAX. The engine reportedly caught fire shortly after take-off.
📹 @LAFlightsLIVE https://t.co/t1HBVLDi0P pic.twitter.com/vYNgkpZJcq
— RT_India (@RT_India_news) July 19, 2025
ఏవియేషన్ ఏ2జెడ్ నివేదిక ప్రకారం, విమానం విమానాశ్రయం నుంచి బయలుదేరిన వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్స్ అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సమాచారం అందించారు. స్పందిచిన ఏటీసీ ఎయిర్ పోర్టులో అత్యవసర సేవలకు సమాచారం అందించింది. పైలట్స్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఇంజిన్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యామల్లో వైరల్‌గా మారింది.
🚨 SHOCKING: Delta Boeing 767 makes emergency landing after engine catches fire mid-air.
What’s wrong with Boeing? 😳
Just after takeoff, one engine caught fire.
The flight to Atlanta turned back to LAX within minutes.
Frightened passengers recall the chaos, thankfully no… pic.twitter.com/W6GDIBUhIU
— Times Algebra (@TimesAlgebraIND) July 19, 2025