Earthquake | ఇరాన్లో (Earthquake) మరోసారి భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున ఉత్తర ఇరాన్లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.2గా నమోదయింది. భూమి అంతర్భాగంలో 4 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని యూరోపియన్ మెడిటేరనియన్ సీస్మొలాజికల్ (EMSC) తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివారాలు ఇంకా తెలియరాలేదని అధఙకారులు తెలిపారు.
మరోవైపు తజికిస్తాన్లో కూడా భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 1 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం 160 కిలోమీటర్ల లోతులో ఉంది.
EQ of M: 4.0, On: 20/07/2025 01:01:55 IST, Lat: 36.87 N, Long: 72.10 E, Depth: 160 Km, Location: Tajikistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/c6jTSJ4vQn— National Center for Seismology (@NCS_Earthquake) July 19, 2025
భారత్లోని అస్సాంలోనూ భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. అర్ధరాత్రి 12.56 గంటల సమయంలో నాగావ్ జిల్లాలో2.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 40 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ తెలిపింది.
EQ of M: 2.9, On: 20/07/2025 00:56:13 IST, Lat: 26.25 N, Long: 92.68 E, Depth: 40 Km, Location: Nagaon, Assam.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/fmKYXnXAgu— National Center for Seismology (@NCS_Earthquake) July 19, 2025
కాగా, గత నెల 21న ఇరాన్లో భూ ప్రకంపణలు వచ్చిన విషయం తెలిసిందే. సెమ్నాన్లో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.