Smriti Mandhana | పలాశ్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత టీమిండియా వుమెన్స్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్మృతి వైట్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో మెరిసిపోయారు (Smriti looks glamorous). సింపుల్ మేకప్, స్మైల్‌తో నెటిజన్లను, అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు, అభిమానులు స్మృతి ఫొటోలకు లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు.
వన్డే వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన మంధాన.. ఆ తర్వాత పెళ్లి వార్తతో దేశం దృష్టిని ఆకర్షించింది. పలాశ్ ముచ్చల్‌తో తన అనుబంధాన్ని మరో మెట్టు ఎక్కించాలనుకున్న ఆమె అనుకోకుండా యూటర్న్ తీసుకుంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి రద్దు నిర్ణయంతో అందర్నీ షాక్‌కు గురి చేసింది. బ్రేకప్ తర్వాత కోలుకున్న స్మృతి.. క్రికెట్ తన ఫస్ట్ లవ్ అని, క్రికెట్ ఆడడం తప్ప తనకు ఇంకేది ఇష్టం లేదని వెల్లడించింది. మరోవైపు డిసెంబర్ 21 నుంచి 30 వరకు స్వదేశంలో శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టింది స్మృతి.

Smriti 1

Smriti 2

Smriti 3
Also Read..
“Smriti Mandhana | క్రికెట్ కంటే మరేమీ ఇష్టం లేదు : స్మృతి మంధాన”
“Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..!”