Smriti Mandhana | పలాష్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత టీమిండియా వుమెన్స్ జట్టు వైస్ కెప్టెన్ తొలిసారిగా బయట కనిపించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మందిరా బేడితో జరిగిన టాక్ షోలో స్మృతి పాల్గొన్నది. ఈ సందర్భంగా మంధాన మాట్లాడుతూ క్రికెట్ ఆడం తప్ప తనకు ఇంకేది ఇష్టం లేదని వెల్లడించింది. భారత జట్టు జెర్సీని వేసుకోవడం వల్ల అది తన బాధలన్ని తొలగిపోతాయని.. ఎందుకంటే అది తన బాధ్యతను ఇస్తుందని చెప్పుకొచ్చింది. ‘భారత జెర్సీ ధరించడం నాకు స్ఫూర్తినిస్తుంది. నా చింతలన్నింటినీ తొలగిస్తుంది.
జెర్సీ ధరించిన తర్వాత మీపై బాధ్యతలు ఉన్నందున మీకున్న సమస్యలన్నింటినీ పక్కన పెట్టాలని నేను ఎప్పుడూ అందరికీ చెబుతాను. మీరు లక్షలాది మందికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మీరు మంచి ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి పెడితే సరిపోతుంది’ అని తెలిపింది. అయితే, సందర్భంగా మందిర జట్టులో విభేదాలు ఉన్నాయా? ఉంటే వాటిని ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించింది. దానికి స్మృతి స్పందిస్తూ.. ‘ఈ ప్రశ్న అడిగినందుకు మిమ్మల్ని అభినందిస్తున్న. జట్టులోని ప్రతి ఒక్కరూ జట్టులోని ప్రతి ఒక్కరూ దేశం కోసం మ్యాచులు గెలవాలని కోరుకుంటున్నందున ఎలాంటి సమస్యలు లేవని నేను అనుకుంటున్నాను.
ఈ విషయంపై ప్రతి ఒక్కరికీ వారి సొంత అభిప్రాయం ఉంటుంది. మనం ఏదైనా విషయంలో విభేదిస్తే దేశం గెలవడానికి కట్టుబడి లేమన్నదాన్ని చూపిస్తుంది’ అంటూ స్మృతి చెప్పింది. జట్టులో డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చలు జరుగుతాయని.. కానీ, వాటిని చర్చ అని పిలువనని.. మనం ప్లేయింగ్ లెవెన్ని ఎంచుకొని.. ముందుగా బ్యాటింగ్ చేయాలా? లేదా బౌలింగ్ చేయాలా? అని నిర్ణయించుకోవాల్సి ఉంటుందని.. మ్యాచ్‌ను ఎలా గెలవాలన్న దానిపై ప్రతి ఒక్కరికీ సొంత అభిప్రాయం ఉంటుందని.. అలాంటి చర్చలు వాదనలుగా మారటాన్ని నేను ఎప్పుడూ చూడలేదని తెలిపింది. తాను హర్మన్‌ప్రీత్ వద్దకు వెళ్లి ఇలా చేయాలని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయని.. తాము ఒకరి అభిప్రాయాలకు ఒకరు నో చెప్పగలిగేంత సంబంధం మాకు ఉంది అంటూ స్మృతి చెప్పుకొచ్చింది.
VIDEO | Indian cricketer Smriti Mandhana says, “I don’t love anything more than cricket, wearing Indian jersey gives the motivation and keeps all problems aside.”
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/CMFFA3A1Nv
— Press Trust of India (@PTI_News) December 10, 2025