Vinesh Phogat | సెమీఫైనల్లో ఓటమి.. ఆసియా క్రీడలకు దూరమైన ఒలింపిక్ విజేత..!
Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ అనంతరం రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికి.. ఆసియా క్రీడ(Asian Games)లతో పునరాగమనం చేయాలనుకున్న వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) కల చెదిరింది.
Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ అనంతరం రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికి.. ఆసియా క్రీడ(Asian Games)లతో పునరాగమనం చేయాలనుకున్న వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) కల చెదిరింది. భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI)తో పోరాడి, కోర్టు అనుమతితో ట్రయల్స్‌లో పాల్గొన్న ఆమె అనూహ్యంగా ఓటమి పాలైంది. మహిళల 53 కిలోల విభాగంలో పోటీపడి తొలి రెండు రౌండ్లలో గెలుపొందిన ఆమె కీలకమైన సెమీ ఫైనల్లో విఫలమైంది. మీనాక్షి గోయత్ చేతిలో 4-6తో పరాజయంతో ఆసియా క్రీడలకు దూరమైంది.
ఈమధ్యే వీడ్కోలు నిర్ణయం వెనక్కి తీసుకున్న వినేశ్ ఫొగాట్‌కు ఆసియా క్రీడల ట్రయల్స్‌లో చుక్కెదురైంది. న్యూ ఢిల్లీలో శనివారం ఈ మెగా టోర్నీ కోసం జరిగిన రెజ్లర్ల ఎంపిక పోటీల్లో వినేశ్ ఓటమి పాలైంది. 50 కిలోల విభాగలో పోటీపడేందుకు రెజ్లింగ్ సమాఖ్య అనుమతించకపోవడంతో 53 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఆమె తొలి పోరులో జ్యోతిని 7-1తో ఓడించింది.
Minakshi wrestled down Vinesh Phogat in the semifinal at the Asiad Trials.
Minakshi won 6-4 in an intense match.
🗣️ : ” Mai Phir Aaugi ( I’ll comeback), ” said Vinesh Phogat before leaving the mat. pic.twitter.com/fNmB8ISAze
— RevSportz Global (@RevSportzGlobal) May 30, 2026
అదే ఉత్సాహంతో క్వార్టర్ ఫైనల్లో నిషిని 5-0తో చిత్తు చేసిన వినేశ్ జోరుకు మీనాక్షి గోయత్ చెక్ పెట్టింది. కానీ, సెమీఫైనల్లో ఉడుంపట్టుతో ఒలింపిక్ విజేతను రెండు పాయింట్ల(4-6) తేడాతో ఓడించింది మీనాక్షి. దాంతో, ఏడాది జపాన్‌లో జరుగనున్న ఆసియా క్రీడల్లో కుస్తీ పట్టాలనుకున్న వినేశ్‌కు నిరాశే మిగిలింది. సెమీస్‌లో ఓటమిపై స్పందించిన వినేశ్ ‘నేను మళ్లీ వస్తాను’ అని పేర్కొంది.
VIDEO | Delhi: Wrestler Vinesh Phogat speaks to PTI and alleges bias and cheating in the Asian Games selection trials after losing in the semifinal, and vows to come back stronger.
She says, “I am very grateful to the Supreme Court and the Delhi High Court for granting… pic.twitter.com/unGQIIIw0L
— Press Trust of India (@PTI_News) May 30, 2026
క్వార్టర్స్‌లో రగడ
వినేశ్ – నిషి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నాటకీయంగా సాగింది. తొలి మూడు నిమిషాల్లో 0-5తో వెనుకంజలో ఉన్న వినేశ్.. గొప్పగా పుంజుకొని నిషిని పడగొట్టింది. సరిగ్గా ఆ సమయంలోనే రిఫరీ విజిల్ వేసి.. నాలుగు పాయింట్లు కేటాయించాడు. అయితే.. అతడి నిర్ణయాన్ని వినేశ్ సవాల్ చేసి రివ్యూ గెలిచింది. ఆమె భర్త సోమ్విర్ రథీ కూడా నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చివరకు 7-6తో ఆసియా క్రీడలకు అర్హత సాధిస్తుందనుకున్న వినేశ్ ఆశలపై సెమీస్ ప్రత్యర్థి మీనాక్షి నీళ్లు చల్లింది. ఫైనల్లో మీనాక్షిని 3-2తో ఓడించిన అంతిమ్ పంగాల్ ఆసియా క్రీడల 53 కిలోల విభాగంలో ఎంపికైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

