Smriti Mandhana : పెళ్లి రద్దు చేసుకున్న స్మృతి మంధాన (Smriti Mandhana ) మళ్లీ క్రికెట్‌పై దృష్టి సారిస్తోంది. బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చల్ (Palash Muchhal)తో బ్రేకప్ విషయాన్ని చాలా హుందాగా.. చాలా స్పష్టంగా చెప్పేసిన మంధాన.. తాజాగా మరో పోస్ట్‌తో వైరలవుతోంది. పెళ్లి రద్దు నిర్ణయంతో నెట్టింట సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారిన టీమిండియా స్టార్ ప్రశాంతంగా ఉండడం నిశబ్దంగా ఉన్నట్టు కాదని అంటోంది. ఎంతో సంబురంగా వివాహ వేడుకకు సిద్దమైన తను బ్రేకప్ నిర్ణయం తర్వాత మానసికంగా ఎలా ఉంది? అనే విషయాన్ని ఈ పోస్ట్‌తో స్పష్టం చేసింది వైస్ కెప్టెన్.
వన్డే వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన మంధాన.. ఆ తర్వాత పెళ్లి వార్తతో దేశం దృష్టిని ఆకర్షించింది. పలాశ్ ముచ్చల్‌తో తన అనుబంధాన్ని మరో మెట్టు ఎక్కించాలనుకున్న ఆమె అనుకోకుండా యూటర్న్ తీసుకుంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి రద్దు నిర్ణయంతో అందర్నీ షాక్‌కు గురి చేసింది. తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లు, ట్రోల్స్‌పై.. తాజాగా సైలెంట్ పంచ్ విసిరింది మంధాన.
వన్ ప్లస్ 15R ఫోన్ యాడ్‌లో తళుక్కుమన్న మంధాన తన మానసిక స్థయిర్యాన్ని, ఫోన్ ప్రత్యేకతను చాటి చెప్పింది. నా దృష్టిలో ప్రశాంతంగా ఉండడం అంటే నిశబ్దంగా ఉన్నట్టు కాదు. నియంత్రణతో ఉన్నామని అర్ధం ప్రశాతంగా ఉండడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టలేం అని చాలామంది అన్నారు. కానీ, నా మౌనమే మాట్లడగలదు. నా నమ్మకంతో ఎంతటి కష్టాన్నైనా దాటగలను. అందుకే నేను భయానికిలోనవ్వడం కంటే స్పష్టత ఇవ్వడానికి ప్రాధాన్యమిచ్చాను. కొన్నాళ్లుగా ఓటములను స్వీకరిస్తూ వచ్చాను. అయితే.. ఇప్పుడు అన్నీ తెలుసుకున్నా. యాజమాన్యం అనేది ఒక టైటిల్ కాదు. అదొక మైండ్‌సెట్.
Twitter has changed the like ❤️ button to support Smriti mandhana
Tap to check ❤️
“Palash Muchhal” #SmritiMandhana pic.twitter.com/TGDmLDpOMp
— kushsingh (@AvadhrajSi18492) December 7, 2025
మొదటి ఏడాది పాఠాలు నేర్చుకుంటాం. రెండో ఏడాది జవాబులు రాస్తాం. అందరం కలిసి ట్రోఫీని సగర్వంగా అందుకున్నాం. అప్పుడు చిన్న శబ్దాలు మరింత పెద్దవుతాయి. ఇక్కడ నేను మరొకరిని ఛాంపియన్‌గా చూడాలనుకోవడం లేదు. నాదైన స్టయిల్లో ఆటను ముగించాలనుకుంటున్నా. పవర్ అనేది బలం కాదు.. మనలోని కసికి నిదర్శనం అని వీడియో పోస్ట్‌తో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోందీ సొగసరి ఓపెనర్. ఆమె పోస్ట్ పెట్టిన గంటలోనే 8 లక్షలమంది వీక్షించారు. మంధాన ప్రచారకర్తగా వన్ ప్లస్ 15R ఫోన్ డిసెంబర్ 17న మార్కెట్లోకి రానుంది.